ప్రారంభమైన పంజాగుట్ట “స్టీల్‌ బ్రిడ్జ్‌”

హైదరాబాద్‌ నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 19, 2020 | 12:09 PM

హైదరాబాద్‌ నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం మూడు నెలల సమయంలో బ్రిడ్జి పనులు పూర్తిచేశారు.

పంజాగుట్ట శ్మశానవాటిక – చట్నీస్‌ హోటల్‌ మధ్య ఇరుకుగా ఉన్న రోడ్డును ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చేసేందుకు 23 కోట్ల వ్యయంతో ఒకవైపు స్టీల్‌ బ్రిడ్జిని నిర్మించారు. మరోవైపు రోడ్డును రెండు లేన్ల మేరకు విస్తరించేందుకు భూసేకరణ చేపట్టారు. ఇందులో భాగంగానే 5.95 కోట్లతో చేపట్టిన స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని ఫిబ్రవరి 29న పనులు ప్రారంభించి.. మే చివరి వరకు పూర్తిచేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.