ఆరాటం పెళ్లి కొడుకు..ఆగలేక పెళ్లి చేసుకున్నాడు..ఆ తర్వాత
వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా మొన్నటి వరకు లాక్‌డౌన్ అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే సడలింపులు కల్పిస్తున్నారు. అయినప్పటికీ పెళ్లిళ్లు, విందు వినోద కార్యక్రమాలు వంటివి ఎక్కువగా నిర్వహించరాదని, జనాలు గుంపులుగా చేరకూడదని పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ ఆరాటం పెళ్లి కొడుకు ఆగకుండా పెళ్లి చేసుకుని అడ్డంగా బుక్కయ్యాడు.

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా మొన్నటి వరకు లాక్‌డౌన్ అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే సడలింపులు కల్పిస్తున్నారు. అయినప్పటికీ పెళ్లిళ్లు, విందు వినోద కార్యక్రమాలు వంటివి ఎక్కువగా నిర్వహించరాదని, జనాలు గుంపులుగా చేరకూడదని పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ ఆరాటం పెళ్లి కొడుకు ఆగకుండా పెళ్లి చేసుకుని అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ యువకుడికి కరోనా లక్షణాలు కనిపించటంతో కోవిడ్ టెస్టు కోసం నమూనాలను ఇచ్చాడు. ఫలితాలు వచ్చే వరకు ఆగలేకపోయాడు. పెళ్లిని వాయిదా వేసుకోకుండా వంద మందిని ఆహ్వానించాడు. అనంతరం పెళ్లికొడుక్కి కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల, వైద్య సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. నిబంధనలను అతిక్రమించి 100 మందిని పిలిచినందుకు పెళ్లికొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు.




