టాలీవుడ్‌లో ఆ రికార్డు బద్దలు కొట్టిన ఏకైక హీరో రామ్
టాలీవుడ్‌లోనే కాదు సౌత్ ఇండియాలోనే ఎవరూ సాధించలేని ఓ రికార్డు సాధించాడు హీరో రామ్ పోతినేని. ఏకంగా నాలుగు సినిమాలకు 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఏకైక హీరో రామ్. సినిమాలకు కలెక్షన్లతో పాటు యూట్యూబ్‌లో లైక్‌లు, వ్యూస్‌కు సంబంధించిన..

టాలీవుడ్‌లోనే కాదు సౌత్ ఇండియాలోనే ఎవరూ సాధించలేని ఓ రికార్డు సాధించాడు హీరో రామ్ పోతినేని. ఏకంగా నాలుగు సినిమాలకు 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఏకైక హీరో రామ్. సినిమాలకు కలెక్షన్లతో పాటు యూట్యూబ్‌లో లైక్‌లు, వ్యూస్‌కు సంబంధించిన ట్రెండ్ నడుస్తున్న కాలమిది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన రికార్డును కొల్లగొట్టాడు రామ్. తన గత నాలుగు సినిమాలకు హిందీలో డబ్ చేసి, యూట్యూబ్‌లో విడుదల చేయగా.. అవన్నీ 100 మిలియన్ వ్యూస్ సాధించాయి.
ఈ మధ్యే పూరి జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమాను ఫిబ్రవరిలో యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ సినిమా కొద్ది సమయంలోనే 100 మిలియన్ వ్యూస్ సంపాదించాయి. అలాగే రామ్ నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, నేను శైలజ’ సినిమాలు కూడా యూట్యూబ్‌లో హిందీ వర్షన్స్ వంద మిలియన్ వ్యూస్ దాటేశాయి. ఈ ఘటన సాధించిన తొలి దక్షిణాది హీరో రామ్ కావడం విశేషం. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
USTAAD @ramsayz is the Only South Indian star to have 4 consecutive films (including 2 films from our production) with 100M+views & 1.1M+ likes♥️
Hoping to add #REDTHEFILM to the list soon!
Thank You for all the LOVE..? pic.twitter.com/CeHoz8AMzV
— Sri Sravanthi Movies (@SravanthiMovies) April 29, 2020
Read More:
వెహికల్ ట్యాక్స్‌పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం