ఆ నాలుగు వేల మందికి క్వారంటైన్ పూర్తయ్యాకే ఇళ్లకు పంపిస్తాం
వీరందరినీ ముందు క్వారంటైన్ కేంద్రాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కరోనా లక్షణాలు లేవని నిర్థారించుకున్నాకే వారిని స్వస్థలాకు పంపుతామని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లా అధికారులు చర్యలు..

లాక్‌డౌన్ కారణంగా గుజరాత్‌లో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులు గురువారం సాయంత్రానికి సొంత జిల్లాలకు చేరుకుంటారని.. ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ జిల్లాలకు చెందిన 4 వేల మంది మత్స్యకారులు 65 బస్సుల్లో మంగళవారం గుజరాత్ నుంచి బయల్దేరినట్లు తెలిపారు. వీరిలో 2,852 మంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు కాగా.. మిగతావారు విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారున్నారని తెలిపారు మంత్రి.
వీరందరినీ ముందు క్వారంటైన్ కేంద్రాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కరోనా లక్షణాలు లేవని నిర్థారించుకున్నాకే వారిని స్వస్థలాకు పంపుతామని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందొద్దని, వారందరినీ ప్రభుత్వమే సొంత గ్రామాలకు తీసుకొస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే సీఎం జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎంలతో మాట్లాడారని, వారి అనుమతితోనే మత్స్యకారులను ఏపీకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసినట్టు మోపిదేవి వివరించారు. వారిని సొంత గ్రామాలకు చేర్చేందుకు మొత్తం ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు మంత్రి మోపిదేవి వెంకటరమణ.
Read More:
వెహికల్ ట్యాక్స్‌పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం



