కరోనా విలయం: ప్రపంచవ్యాప్తంగా 32 లక్షలు దాటిన కరోనా కేసులు..
కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 32,19,240 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,28,190కి చేరింది. అయితే రికవరీ కేసులు కూడా భారీ ఎత్తున పెరగడం కాస్త ఊరటను ఇచ్చే విషయం. ఇప్పటి దాకా 10,00,101 మంది ఈ వైరస్ […]

కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 32,19,240 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2,28,190కి చేరింది. అయితే రికవరీ కేసులు కూడా భారీ ఎత్తున పెరగడం కాస్త ఊరటను ఇచ్చే విషయం. ఇప్పటి దాకా 10,00,101 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 19,90,949 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. వీరిలో 59,808 పేషెంట్లు ఐసీయూలో ఉన్నారు.
ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. అత్యధికంగా ఈ దేశంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 10,64,194కి చేరింది. ఇక 61,656 మంది కరోనాతో మరణించారు. ఓవరాల్‌గా చూస్తే స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కాగా, కరోనా పుట్టినిల్లు చైనాలో కూడా మరోసారి వైరస్ ఛాయలు కనిపిస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే.. ఇప్పటివరకూ 31,787 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 1,008 మంది ప్రాణాలు కోల్పోగా, 7,797 మంది డిశ్చార్జి అయ్యారు.
Read More:
వెహికల్ ట్యాక్స్‌పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం