Telangana Intermediate Board: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీకి రాకున్నా పరీక్షలు రాయొచ్చు..!
Telangana Intermediate Board: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి..
Telangana Intermediate Board: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులంతా కాలేజీలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, తాజాగా ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఉమర్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థులంతా కాలేజీలకు రావడం తప్పనిసరేం కాదన్నారు. తరగతులకు హాజరుకాకుండానే విద్యార్థులు నేరుగా వార్షిక పరీక్షలకు హాజరు కావొచ్చునని ప్రకటించారు. ఇలా నేరుగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కూడా రెగ్యూలర్ విద్యార్థులగానే పరిగణిస్తామని సయ్యద్ ఉమర్ స్పష్టం చేశారు.
కాగా, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కరోనా నిబంధనలను పాటిస్తూ ఒక రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మరుసటిరోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని సంబంధిత కాలేజీలకు రాష్ట్ర విద్యాశాఖ సూచనలు చేసింది. దాని ప్రకారం మొత్తం 66 రోజులు తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సమయాభావం కారణంగా.. సిలబస్‌ను 30శాతం తగ్గించనున్నట్లు ప్రకటించారు.
Also read:
బనగానపల్లె నేతల మధ్య ముదురుతున్న మాటల తూటాలు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు.. డిబెట్‌కి సిద్దమని ప్రకటన..