Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 214 పాజిటివ్‌ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 28,791 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా..  214 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం...

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 214 పాజిటివ్‌ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 22, 2021 | 10:09 AM

Telangana Corona Cases:  తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 28,791 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా..  214 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,92,835కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు విడిచినట్లు  వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది‌. దీంతో మృతుల సంఖ్య 1,586కి చేరింది. వ్యాధి బారి నుంచి గురువారం 351 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,87,468కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,781 ఉండగా వీరిలో 2,178 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 76,02,975  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. మరోవైపు భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తున్నారు. వైద్య సిబ్బంది,పారిశుధ్య సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు.

Also Read :

Telangana Intermediate Board: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీకి రాకున్నా పరీక్షలు రాయొచ్చు..!

Begger Free HYD: భాగ్య నగరాన్ని బెగ్గర్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు మరో ముందడుగు.. జీహెచ్‌ఎమ్‌సీ స్పెషల్‌ డ్రైవ్‌..