Car Accident: హిమాయత్ సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఫల్టీలు కొట్టి చెట్ల పొదల్లో పడిన కారు.. దృశ్యాలు..
Car Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుంగా అడ్డంగా..
Car Accident: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుంగా అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి ఓ కారు ఫల్టీలు కొట్టి చెట్ల పొదల్లోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న లేడీ డాక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన లేడీ డాక్టర్ తన కారులో వెళ్తున్నారు. హిమాయత్ సాగర్ సమీపానికి చేరగానే కారుకు అడ్డంగా కుక్క వచ్చింది. ఆ కుక్కను తప్పించేందుకు ఒక్కసారిగా ఆమె స్టీరింగ్‌ను పక్కకు తిప్పారు.
దాంతో కారు అదుపు తప్పి ఫల్టీలు కొట్టింది. రోడ్డు పక్కన చెట్ల పొదల్లో ఎగిరి పడింది. ఇది గమనించిన స్థానికులు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలతో కారులో ఇరుక్కున్న లేడీ డాక్టర్‌ను బయటకు తీశారు పోలీసులు. ఆమెను అంబులెన్స్‌లో స్థానికి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Manchu Laxmi: మాల్దీవుల్లో సందడి చేస్తోన్న మంచు వారి కుటుంబం… వైరల్‌గా మారిన ఫొటోలు..