Parliament of India: జనవరి 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఎంపీ లు అందరికీ స్పీకర్ ఓం బిర్లా కీలక సూచనలు..

Parliament of India: జనవరి 29నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకో..

Parliament of India: జనవరి 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఎంపీ లు అందరికీ స్పీకర్ ఓం బిర్లా కీలక సూచనలు..
Om-Birla
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 22, 2021 | 9:27 AM

Parliament of India: జనవరి 29నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలంతా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పష్టం చేశారు. కోవిడ్‌ దృష్ట్యా ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌ సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమావేశం అవుతారని వెల్లడించారు. సెప్టెంబర్‌లో జరిగిన విధంగానే లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు కొనసాగుతాయని అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగం మాత్రం సెంట్రల్‌ హాల్‌లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సమావేశానికి వచ్చే ఎంపీలు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. ఎంపీల పీఏలు, వ్యక్తిగత సిబ్బంది కూడా తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఇందు కోసం ఈనెల 27,28 తేదీల్లో పార్లమెంట్‌ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓంబిర్లా పేర్కొన్నారు.

Also read:

HYD City Buses: హైదరాబాద్‌ నగర ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌… రోడ్డెక్కనున్న మరిన్ని సిటీ బస్సులు..

Mystery Disease: పశ్చిమగోదావరి జిల్లాలో భయాందోళనకు గురిచేస్తోన్న వింత వ్యాధి.. తాజాగా ఒకరు మృతి..!