Gold Rate Today(22-01-2021): వరుసగా పెరుగుతున్న బంగారం ధర… తులం విలువ ఎంతంటే..?
బంగారం ధర వరుసగా పెరుగుతోంది. ఐదు రోజుల వ్యవధిలో రూ.700 పెరుగుదలను నమోదు చేసుకుంది. జనవరి 17న 24 క్యారెట్ల ధర...
బంగారం ధర వరుసగా పెరుగుతోంది. ఐదు రోజుల వ్యవధిలో రూ.700 పెరుగుదలను నమోదు చేసుకుంది. జనవరి 17న 24 క్యారెట్ల ధర రూ.48,900గా నమోదైంది. కాగా నేడు జనవరి 22న దేశ వ్యాప్తంగా బంగారం ధర రూ. 49,600 పలుకుతోంది.
ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,910 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,180గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,250 ఉండగా… 24 క్యారెట్ల ధర రూ.50,450గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.48,600, కాగా 24 క్యారెట్ల ధర రూ.49,600. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,800గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450గా నమోదైంది.