Petrol – Diesel Price Today(22-01-2021): ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.20.. ఏ రాష్ట్రంలో అధిక రేటు అంటే..?

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.88.63 ఉండగా, డీజిల్ ధర రూ.82.26 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రేట్లలో...

Petrol – Diesel Price Today(22-01-2021): ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.20.. ఏ రాష్ట్రంలో అధిక రేటు అంటే..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 22, 2021 | 7:20 AM

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.20గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 75.38గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.91.80 ఉండగా, డీజిల్ ధర రూ.82.13గా ఉంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.88.63 ఉండగా, డీజిల్ ధర రూ.82.26 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రేట్లలో పెరుగుద‌ల న‌మోద‌వుతోంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.33 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ,ధర రూ.85.08 వద్ద ఉంది. ఇక అమరావతిలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.92కాగా, డీజిల్‌ ధర రూ.84.38 గా ఉంది.

దేశంలో జైపూర్‌లో ఈరోజు పెట్రోల్ రేటు అధికంగా రూ.93.06గా న‌మోదైంది. ఆ త‌ర్వాతి స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరులో లీట‌రు పెట్రోల్ ధ‌ర రికార్డు స్థాయిలో రూ.92గా ఉంది. ఆ త‌ర్వాతి స్థానంలో ముంబైలో రూ.91.80గా న‌మోదైంది.

Also Read: స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు.. చరిత్ర సృష్టించిన దేశీయ స్టాక్ ఎక్చేంజ్.. 50వేల మార్క్ దాటిన బీఎస్ఈ