Amazon: సైట్‌లో సాంకేతిక కారణంగా తలెత్తిన సమస్య .. వినియోగదారుడికి రూ.45 వేలు చెల్లించిన అమోజాన్‌

Amazon: అప్పుడప్పుడు చిన్న పొరపాటే కొంపముంచుతుంది. అమెజాన్‌ సైట్‌లో తలెత్తిన సాంకేతిక కారణంగా రూ.45వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి ...

Amazon: సైట్‌లో సాంకేతిక కారణంగా తలెత్తిన సమస్య .. వినియోగదారుడికి రూ.45 వేలు చెల్లించిన అమోజాన్‌
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2021 | 8:12 PM

Amazon: అప్పుడప్పుడు చిన్న పొరపాటే కొంపముంచుతుంది. అమెజాన్‌ సైట్‌లో తలెత్తిన సాంకేతిక కారణంగా రూ.45వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుప్రియో రంజన్‌ మహాపాత్ర అనే న్యాయ విద్యార్థి 2014లో అమెజాన్‌లో ఓ ల్యాప్‌టాప్‌ కోసం సెర్చ్‌ చేస్తుండగా, రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ కేవలం రూ.190కే ఆఫర్‌ కింద అందుబాటులో ఉండటంతో ఆర్డర్‌ చేసుకున్నాడు. అయితే సదరు న్యాయవాది ఆర్డర్‌ చేసిన రెండు గంటల తర్వాత ఆ ఆర్డర్‌ రద్దు కావడంతో అమెజాన్‌ కస్టమర్‌ సర్వీసును సంప్రదించాడు. అయితే సైట్‌లో సాంకేతిక కారణంగా ల్యాప్‌టాప్‌ ధర తక్కువ చూపిందని, మీ ఆర్డర్‌ను రద్దు చేస్తున్నామని అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌ విభాగం తెలిపింది.

దీంతో సుప్రియో రంజన్‌ ఒడిశా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఒక ప్రాజెక్టు పూర్తి చేయడానికి అత్యవసరంగా ల్యాప్‌టాప్‌ అవసరమున్న నేపథ్యంలో రూ.190కే ల్యాప్‌టాప్‌ అని చూసి ఆర్డర్‌ చేస్తే అమెజాన్‌ దానిని రద్దు చేసిందని, తనకు న్యాయం చేయాలని కోరాడు. ఇందుకు సంబంధించిన విచారణ అప్పటి నుంచి కొనసాగగా, తాజాగా ముగిసింది. ఆర్డర్‌ రద్దు చేసినందుకు గానూ బాధితుడికి నష్టపరిహారం కింద రూ.40 వేలు, ఖర్చుల కింద మరో రూ.5 వలను అమెజాన్‌ చెల్లించాలని ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ తీర్పునిచ్చింది. ఇలా కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగిన పొరపాటే నష్టానికి దారి తీస్తుంది.

Also Read: స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు.. చరిత్ర సృష్టించిన దేశీయ స్టాక్ ఎక్చేంజ్.. 50వేల మార్క్ దాటిన బీఎస్ఈ