AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు.. చరిత్ర సృష్టించిన దేశీయ స్టాక్ ఎక్చేంజ్.. 50వేల మార్క్ దాటిన బీఎస్ఈ

సెన్సెక్స్‌ మాత్రం ఇవాళ పరుగులు పెట్టింది. బుల్ జోరుతో కొత్త చరిత్ర రికార్డ్ అయ్యింది.

స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు.. చరిత్ర సృష్టించిన దేశీయ స్టాక్ ఎక్చేంజ్.. 50వేల మార్క్ దాటిన బీఎస్ఈ
Balaraju Goud
|

Updated on: Jan 21, 2021 | 6:58 PM

Share

Sensex today :  కరోనాతో ఆదాయలు తగ్గాయి. ఖర్చు పెట్టే శక్తి తగ్గిపోయింది. కొత్త ఉద్యోగాలు లేవు. ఎగుమతులు కూడా పెద్దగా పెరగలేదు. కానీ సెన్సెక్స్‌ మాత్రం ఇవాళ పరుగులు పెట్టింది. బుల్ జోరుతో కొత్త చరిత్ర రికార్డ్ అయ్యింది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా 50వేల మార్క్‌ను దాటింది. అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువు దీరడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో జోష్‌ అందుకుంది. విదేశీ పెట్టుబడులు పెరగడం, బడ్జెట్‌పై పాజిటివ్‌ రెస్పాన్స్‌తో దలాల్‌ స్ట్రీట్‌ కళకళలాడింది. చివరకు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదంతో 50 వేల కిందకు పడింది.

ఇప్పటికే సరికొత్త శిఖరాలకు చేరిన మార్కెట్‌ గురువారం కూడా అదే ట్రెండ్‌ కొనసాగించింది. ఆరంభంలోనే కీలక సూచీలు రెండూ సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాయి. ముఖ్యంగా సెన్సెక్స్‌ తొలిసారి 50 వేల రికార్డు స్థాయిని అధిగమించగా నిఫ్టీ కూడా 14,700 మార్క్‌ను దాటేసి ఆల్‌ టైం రికార్డు స్థాయిని తాకింది. దాదాపు 42ఏళ్ల స్టాక్ మార్కెట్ ప్రస్తానంలో 50వేల మార్క్‌ను అధిగమించిన కీలకఘట్టం నమోదైంది. కేవలం పది నెలల కాలంలో రెట్టింపు వృద్ధిని నమోదు చేయడం విశేషం. అటు నిఫ్టీ కూడా అదే స్థాయిలో కొనసాగింది. ఇవాళ నిఫ్టీ కూడా 14,753.55 గరిష్ట స్థాయిని తాకింది.

కాగా, చివరికి గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 49,624.76 వద్ద ముగిసింది, అటు నిఫ్టీ 54 పాయింట్లు తగ్గి 14,590 వద్ద ఉంది. టాటా మోటార్స్ (5.71 శాతం), బజాజ్ ఫైనాన్స్ (2.74 శాతం), రిలయన్స్ (2.18 శాతం), బజాజ్ ఆటో (1.63 శాతం) ఈ రోజు అత్యధిక లాభాలు సాధించగా, ఒఎన్‌జిసి (-4.20 శాతం), టాటా స్టీల్ (-3.40 శాతం), గెయిల్ (-3.08 శాతం), కోల్ ఇండియా (-2.93 శాతం) ఈ రోజు అత్యధికంగా నష్టాలను చవిచూశాయి.

Read Also… స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇటు అధికారులతో ఎస్ఈసీ భేటీ.. అటు సుప్రీంకు ఏపీ సర్కార్..!