స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇటు అధికారులతో ఎస్ఈసీ భేటీ.. అటు సుప్రీంకు ఏపీ సర్కార్..!

రాష్ట్ర ఎన్నకల సంఘం కార్యాలయంలో ఉద్యోగులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ అయ్యారు.

స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇటు అధికారులతో ఎస్ఈసీ భేటీ.. అటు సుప్రీంకు ఏపీ సర్కార్..!
Follow us

|

Updated on: Jan 21, 2021 | 6:29 PM

SEC Meeting with Employees : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. అయితే, దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించింది. ఇదిలావుంటే, రాష్ట్ర ఎన్నకల సంఘం కార్యాలయంలో ఉద్యోగులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ అయ్యారు. అధికారులతో సమావేశం ఏర్పాటుకు నిమ్మగడ్డ తేదీలను ఖరారు చేయనున్నారు. రెండ్రోజుల్లో సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన సమావేశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు నిమ్మగడ్డ లేఖ రాయనున్నారు.

ఇదిలావుంటే. స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేసిన ధర్మసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అలాగే, ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను హైకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని.. ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో ముందుకు సాగాలని హైకోర్టు సూచించింది. కాగా.. ఈనెల 8న ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ ప్రకటించింది.

Read Also… తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్.. ఇప్పుడు రాష్ట్రమంతా ఒకటే చర్చ.. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు..?