మళ్లీ లాక్‌డౌన్.. వైన్ షాపులకి పరుగులు పెడుతోన్న మందు బాబులు..

ఇప్పుడు అలాంటి సీనే రిపీట్ అయ్యింది. ఆ ఇబ్బంది రాకూడదని.. ముందుగానే లీటర్ల మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు మందుబాబులు. వైన్ షాపుల ముందు జనాలు బారులు తీరుతున్నారు. చాంతాడంత క్యూ లైన్లు ఉండటంతో తమకు బాటిల్స్ దొరుకుతాయో లేదో....

  • Tv9 Telugu
  • Publish Date - 2:53 pm, Wed, 17 June 20
మళ్లీ లాక్‌డౌన్.. వైన్ షాపులకి పరుగులు పెడుతోన్న మందు బాబులు..

కరోనా ప్రారంభమయ్యే సమయంలో.. మొదటిసారి దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. దాదాపు రెండు నెలల పాటు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఆ లాక్‌డౌన్‌లో మందు దొరక్క మద్యం ప్రియులు తెగ వర్రీ అయిపోయారు. మరికొంత మంది అయితే పిచ్చోళ్లు కూడా అయిపోయారు. వైన్ షాపులు ఎప్పుడు తీస్తారా అని తెగ ఎదురు చూశారు. మొత్తానికి కొన్ని రోజుల తర్వాత వైన్‌ షాపులు ఓపెన్ చేయడంతో మొదటి రోజే.. కిలో మీటర్ల మేర లైన్లు కనిపించాయి.

ఇప్పుడు అలాంటి సీనే రిపీట్ అయ్యింది. ఆ ఇబ్బంది రాకూడదని.. ముందుగానే లీటర్ల మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు మందుబాబులు. వైన్ షాపుల ముందు జనాలు బారులు తీరుతున్నారు. చాంతాడంత క్యూ లైన్లు ఉండటంతో తమకు బాటిల్స్ దొరుకుతాయో లేదో.. అని టెన్షన్‌కి గురి అవుతున్నారు మద్యం ప్రియులు. ఎందుకంటే.. 2020 జున్ 19వ తేదీ నుంచి నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించనుంది తమిళ ప్రభుత్వం.

తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో లాక్‌డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో మందుబాబులు లిక్కర్ షాపుల వద్ద పెద్ద క్యూ లైన్ కడుతున్నారు. తమిళనాడులో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తోంది. దీంతో కోవిడ్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించిన తమిళ ప్రభుత్వం.. చెన్నై, కాంచిపురం, చంగల్పట్టు, తిరువల్లూరు జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించింది. జూన్ 19వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దాదాపు 11 రోజులపాటు లాక్‌డౌన్ ఆ జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు సీఎం పళని స్వామి. దీంతో ముందుగానే మందు బాటిళ్లను కొనుగోలు చేయాలని భావించిన మందు బాబులు.. వైన్ షాపుల ముందు పెద్ద క్యూ కడుతున్నారు. ఉదయం నుంచే కిలో మీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి.

Read More: 

బిగ్ బ్రేకింగ్: కరోనాతో ముఖ్యమంత్రి పీఏ మృతి..

బ్రేకింగ్: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..

షాకింగ్: ప్రతీ ఐదుగురిలో ఒకరికి కరోనా ముప్పు.. నిపుణుల రిపోర్ట్

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..