చైనాకు భారీ షాక్.. 500 ఉత్పత్తుల బహిష్కరణ..!

భారత్ - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. భార‌త‌సైన్యంపై చైనా దాడిచేయ‌డంపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌ధ్యంలో చైనాకు గుణ‌పాఠం చెప్పాల‌ని దేశంలోని వ్యాపారులంతా

చైనాకు భారీ షాక్.. 500 ఉత్పత్తుల బహిష్కరణ..!
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2020 | 2:46 PM

భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. భార‌త‌సైన్యంపై చైనా దాడిచేయ‌డంపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌ధ్యంలో చైనాకు గుణ‌పాఠం చెప్పాల‌ని దేశంలోని వ్యాపారులంతా నిర్ణ‌యించారు. చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) సిద్ధమ‌య్యింది. చైనా ఉత్పత్తులను బహిష్కరించడానికి, భారతీయ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి క్యాట్ ఇండియన్ గూడ్స్ – అవర్ ప్రైడ్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో.. చైనాకు సంబంధించిన 500 వస్తువుల జాబితాను సిద్ధం చేసింది. వీటిని బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యించింది. వీటిలో రోజువారీ వినియోగ‌ వస్తువులు, బొమ్మలు, దుస్తులు, బిల్డర్ హార్డ్‌వేర్, పాదరక్షలు, వంటగది సామాను, చేతి సంచులు, సౌందర్య సాధనాలు, బహుమతి వస్తువులు, ఎలక్ట్రికల్ ప‌రిక‌రాలు, ఆహార ప‌దార్థాలు, గడియారాలు, రత్నాలు, ఆభరణాలు, స్టేషనరీ, పేపర్, గృహోపకరణాలు, ఫర్నీచర్, లైటింగ్, ఆరోగ్య ఉత్పత్తులు, ప్యాకేజింగ్ ఉత్పత్తులు, ఆటో విడి భాగాలు, నూలు, ఫెంగ్ షుయ్ వ‌స్తువులు, దీపావళి, హోలీ వస్తువులు, కళ్ళజోళ్లు మొద‌లైన‌వి ఉన్నాయి.