TV9 Positive News: మహమ్మారి ఉగ్రరూపం విడిచింది.. ఊరటనిస్తున్న కొత్త కేసులు, రికవరీలు
కరోనా తోక ముడిచిందా? సెకండ్ వేవ్ కంట్రోల్ అయ్యిందా? హాస్పిటల్స్ ఖాళీ అవుతున్నాయా? మనమిక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చా? కాస్త రిలాక్స్ అవ్వండి అంటున్నాయి కొన్ని పరిణామాలు.
కరోనా తోక ముడిచిందా? సెకండ్ వేవ్ కంట్రోల్ అయ్యిందా? హాస్పిటల్స్ ఖాళీ అవుతున్నాయా? మనమిక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చా? కాస్త రిలాక్స్ అవ్వండి అంటున్నాయి కొన్ని పరిణామాలు. సమీపంలోనే మళ్లీ మంచిరోజులు రాబోతున్నట్లు కనిపిస్తోంది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సోమవారం 4872 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. మంగళవారం కాస్త పెరిగిన కేసుల సంఖ్య.. 7796 గా ఉంది. అయితే మాత్రం… ఎంతలో ఎంత మార్పు. 25 వేలను తాకిన కేసుల సంఖ్య భారీగా పడిపోవడం ఊరటనిచ్చే విషయమే. దీంతో హాస్పిటల్స్ బెడ్‌లు ఖాళీ అవుతున్నాయి. కొత్తగా వచ్చే కరోనా పేషెంట్ల సంఖ్య అతి తక్కువ మాత్రమే. ఆక్సిజన్ అందక 23 మంది చనిపోయిన అత్యంత విషాద ఘటనకు వేదికైన తిరుపతి రుయాలో.. ఇపుడు ఖాళీ బెడ్లు దర్శనమిస్తున్నాయి. అంబులెన్సుల క్యూ లేదు.. మార్చురీల్లో శవాల గుట్టలూ లేవు! నిన్నా, మొన్నటి వరకూ బయట ఏర్పాటు చేసిన క్రయిజ్ సెంటర్లోనూ బెడ్‌లనూ పేషంట్లు ఖాళీ అయ్యారు. నిన్న మొన్నటి వరకు ఉరుకులు, పరుగులు పెట్టిన సిబ్బంది కూడా ఇప్పుడు కాస్తా రిలాక్స్ అయ్యారు. ఆక్సిజన్ కోసం అల్లాడిపోయే పరిస్థితులు తగ్గాయి. తమవారికి ఎలా ఉందో అంటూ ఆసుపత్రి బయట వినిపించే ఏడ్పులు ఇప్పుడు లేవు. పేషంట్ల బంధువుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక్కరిద్దరే అక్కడ కనిపిస్తున్నారు.
బెడ్లు సరిపోక జర్మన్ హంగర్లతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హాస్పిటల్స్ పూర్తిగా ఖాళీ అయిపోయాయి. రుయా ఆసుపత్రిలో జర్మన్ షెడ్ పూర్తిగా మూసివేశారు. మొన్నటివరకూ బెడ్ దొరకకపోవడంతో.. ఈ తాత్కాలిక ఆసుపత్రిలోనే ఎంతోమంది తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక్కడే ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ ట్రేటర్లు పెట్టి జనాల ప్రాణాలు కాపాడారు వైద్యులు. కానీ ఇప్పుడు ఈ జర్మన్ షెడ్ అవసరం లేదు. బెడ్లు మొత్తం ఖాళీ అయిపోయాయి.
కాళీగా కనిపిస్తున్న పడకలు
ఉభయ తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా వార్డులోని పడకలు సింహ భాగం మేరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అదేసమయంలో ఆస్పత్రుల వద్ద నిరంతరం వినిపించే అంబులెన్స్ సైరెన్ శబ్దాలు ఇపుడు వినిపించడం లేదు. గత నెలలో కరోనా పాజటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయిన విషయం తెల్సిందే. ఒక కరోనా బాధితుడు డిశ్చార్చి అయితేగానీ, మరో బాధితుడికి అడ్మిషన్ కల్పించలేని పరిస్థితి నెలకొంది. అలాగే, కరోనా బాధితులతో ఆస్పత్రులకు నిరంతరాయంగా అంబులెన్సులు సైరన్ మోగించుకుంటూ వస్తుండేవి. అలా వచ్చిన అంబులెన్సులు ఆస్పత్రి ప్రధాన ద్వారం నుంచి రోడ్డు వెలుపల ఒక ఫర్లాంగు దూరం వరుసలో ఉన్న దృశ్యాలు కనిపించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్ని ఆస్పత్రుల్లోని కరోనా వార్డుల్లో ఉండే పడకలు ఖాళీగా కనిపిస్తున్నాయి. గతంతో ఔట్ పేషంట్లు రోజు చాలా మంది వరకు వచ్చేవారు. ఇపుడు ఈ సంఖ్య భారీగా తగ్గిపోయింది. అలాగే, ఇన్‌పేషంట్లుగా చేరే రోగుల సంఖ్య కూడా పదుల సంఖ్య లోపుగా ఉంది. అదేవిధంగా ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందే కరోనా బాధితుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,796 పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా