AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ap Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త‌గా 7,796 పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు సోమ‌వారంతో పోలిస్తే మంగ‌ళ‌వారం కాస్త పెరిగాయి. కొత్త‌గా 24 గంటల వ్య‌వ‌ధిలో 89,732 మంది శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా..

Ap Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త‌గా 7,796 పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా
andhra-pradesh-corona
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2021 | 5:51 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు సోమ‌వారంతో పోలిస్తే మంగ‌ళ‌వారం కాస్త పెరిగాయి. కొత్త‌గా 24 గంటల వ్య‌వ‌ధిలో 89,732 మంది శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 7,796 కేసులు నమోదయ్యాయి. మ‌రో 77 మంది వైర‌స్ కార‌ణంగా మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 11,629కి చేరింది. కరోనా నుంచి కొత్త‌గా 14,641 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,07,588 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా చిత్తూరులో 12 మంది చనిపోగా, పశ్చిమగోదావరి 10,  అనంతపురం 8, నెల్లూరు 8, శ్రీకాకుళం 7, తూర్పుగోదావరి 6, విశాఖ 6, విజయనగరం 5, గుంటూరు 4, ప్రకాశం 4, కర్నూలు 3, కడపలో 2 ప్రాణాలు విడిచారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు…

దేశంలో క‌రోనా త‌గ్గుముఖం

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త‌గా 86,498 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు 63 రోజుల తరవాత కొత్త కేసులు లక్షకు దిగువకు చేరాయి. పాజిటివిటీ రేటు 4.62 శాతానికి పడిపోయింది. గత కొద్ది రోజులుగా క‌రోనా మ‌ర‌ణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది. సోమవారం 18,73,485 మందికి కొవిడ్ టెస్టులు చేయ‌గా..86,498 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. మొత్తం కేసులు 2.89కోట్లకు పైబడ్డాయి. ఏప్రిల్ ప్రారంభం నుంచి నిత్యం లక్షకు పైగా నమోదైన కేసులు..ఒకొనొక స‌మ‌యంలో.. నాలుగున్నర లక్షలకూ చేరాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు అప్రమ‌త్త‌మై లాక్‌డౌన్, క‌ర్ఫ్యూ వంటి కఠిన ఆంక్షలవైపు మొగ్గుచూపాయి. ఆ ఫలితమే ఇప్పుడు కనిపిస్తోంది.

Also Read: ఈనెల 11న ‘ఆహా’లో విడుదలవుతున్న ‘అర్థశతాబ్దం’.. ఆ మూవీ స్పెషాలిటీస్ ఇవే

 డిగ్రీ అర్హత ఉన్నవారికి మంచి అవకాశం మంచి వేతనంతో జాబ్ నోటిఫికేషన్..