Covid-19 vaccine: ఆ రాష్ట్రాల్లోనే కోవిడ్ వ్యాక్సిన్ల వృథా అధికం.. అరికట్టాలని సూచించిన కేంద్రం
Covid-19 vaccine wastage: దేశంలో ఓవైపు కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కోవిడ్-19
Covid-19 vaccine wastage: దేశంలో ఓవైపు కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కోవిడ్-19 టీకా కోసం జనం ఎగబడుతున్నారు. కొన్నిచోట్ల వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కూడా పలు రాష్ట్రాలు వ్యాక్సిన్‌ను బాగా వృథా చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో అసలే కరోనా వ్యాక్సిన్ల కొరత ఉండగా, పలు రాష్ట్రాలు టీకాలు వేసే క్రమంలో వ్యాక్సిన్‌ను వృథా చేస్తున్నాయి. దేశంలో ఎక్కువగా జార్ఖండ్ రాష్ట్రంలో 37.3 శాతం వ్యాక్సిన్ వృథా చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జార్ఖండ్ తరువాత ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో 30.2 శాతం, తమిళనాడులో 15.5 శాతం, జమ్మూకాశ్మీర్లో 10.8 శాతం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 10.7 శాతం వ్యాక్సిన్‌ను వృథా చేశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే.. వ్యాక్సిన్ వృథాలో జాతీయ సగటు 6.3 శాతంగా ఉందని పేర్కొంది.
కాగా.. కోవిడ్ వ్యాక్సిన్ వృథాను తగ్గించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇప్పటికీ రాష్ట్రాలకు సూచిస్తూనే ఉంది. అంతకు ముందు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం వ్యాక్సిన్ వృధాను తగ్గించాలని రాష్ట్రాలను కోరారు. ప్రస్తుత సెకండ్ వేవ్‌లో దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా.. మరణాల రేటు ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకట్టవేయొచ్చని భావిస్తోంది. ఇప్పటికే దేశంలో 20కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు వేశారు.
Also Read: