భారీగా కరోనా మరణాలు.. శవాలతో నిండిపోయిన అతిపెద్ద శ్మశాన వాటిక
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షల్లో ప్రాణాలను కోల్పోయారు ప్రజలు. ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయితే.. కోటికి దగ్గరలో ఉన్నాయి. ఇక కరోనా బాధితుల మరణాల్లో ఒక్కో దేశం నువ్వా నేనా...

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లక్షల్లో ప్రాణాలను కోల్పోయారు ప్రజలు. ఇక కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయితే.. కోటికి దగ్గరలో ఉన్నాయి. ఇక కరోనా బాధితుల మరణాల్లో ఒక్కో దేశం నువ్వా నేనా అనేలా కేసులు నమోదవుతున్నాయి. అందులోనూ బ్రెజిల్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే బ్రెజిల్ కరోనా మృతుల్లో రెండవ స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా మృతులను ఖననం చేసేందుకు శ్మశానాల్లో కూడా చోటు లభించడం లేదు. దీంతో పాత సమాధులను తవ్వేసి కరోనా మృతుల శవాలను ఖననం చేస్తున్నారు. కాగా సావో పాలోలోని అతి పెద్ద శ్మశాన వాటికలో మూడేళ్ల కిందట కననం చేసిన మృత దేహాలను తీసేసి సమాధులను తవ్వేస్తున్నారు. ప్రస్తుతం బ్రేజిల్‌లో 8,50,796 కేసులు నమోదవ్వగా.. 42,791 మంది మరణించారు.

Read More:
దారుణం.. ఇంటర్ ఫెయిల్‌తో.. ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య!
తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు.. ఉలిక్కిపడుతోన్న ఉద్యోగులు