AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాలో విజృంభిస్తున్న రెండో దశ కరోనా !

కరోనా రెండో దశ మొదలైందా? ఈ మాట వింటేనే ప్రపంచం ఉలిక్కిపడుతోంది. భయంతో వణికిపోతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ రావచ్చన్న హెచ్చరికలు అమెరికాను కలవరపెడుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో అవే సంకేతాలు కనిపిస్తున్నాయి.

చైనాలో విజృంభిస్తున్న రెండో దశ కరోనా !
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 14, 2020 | 1:57 PM

Share

కరోనా రెండో దశ మొదలైందా? ఈ మాట వింటేనే ప్రపంచం ఉలిక్కిపడుతోంది. భయంతో వణికిపోతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ రావచ్చన్న హెచ్చరికలు అమెరికాను కలవరపెడుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో అవే సంకేతాలు కనిపిస్తున్నాయి. చైనాలో రెండో దశ మొదలైందా అన్నరీతిలో అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటిదాకా వుహాన్ సిటీకే పరిమితమైన కరోనా వైరస్ బీజింగ్‌ చేరింది. వుహాన్‌లో కరోనా ఉధృతి కనిపించిన రోజుల్లో బీజింగ్‌ మామూలుగానే ఉంది. కానీ కరోనా వైరస్‌ సీన్‌ ఇప్పుడు చైనా రాజధాని బీజింగ్‌కు మారింది. బీజింగ్‌లోని జిన్‌ఫాది హోల్‌సేల్‌ మార్కెట్‌లో కరోనా వైరస్ బయటపడింది. తాజాగా రాజధాని బీజింగ్‌లో కరోనా టెర్రర్‌ సృష్టిస్తోంది. బీజింగ్‌ మార్కెట్‌లో కరోనా చాలామందికి సోకడంతో యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టారు. బీజింగ్‌లో 517 మందికి కరోనా టెస్ట్‌లు చేయగా 45 మందికి పాజిటివ్‌ రావడంతో మళ్లీ ఆంక్షలు విధించారు. టూరిజం స్పాట్‌లు , స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ను రద్దు చేశారు. చైనా రాజధాని బీజింగ్ లో కరోనా విజృంభిస్తోంది. అయితే రెండోదశలో ఎలాంటి లక్షణాలు లేకుండానే జనంలో కరోనా విజృంభిస్తోంది. ఇది మరింత ఆందోళన కలిగించే పరిణామమని చైనా అధికారులు అంటున్నారు. కరోనా నియంత్రణ కోసం మరోసారి లాక్‌డౌన్‌ విధించక తప్పదని అంటున్నారు. మలిదశలో కరోనా విజృంభణకు కారణమైన మార్కెట్లు , ప్రభుత్వ కార్యాలయాను మూసివేస్టున్నట్టు అధికారులు వెల్లడించారు. బీజింగ్‌లో నాన్‌వెజ్‌ మార్కెట్లు తాజాగా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నట్టు గుర్తించారు. బీజింగ్‌లో మాంసం మార్కెట్లను ఇప్పటికే మూసివేశారు. బీజింగ్‌ లోని జిన్‌ఫాది మాంసం మార్కెట్‌లో 10 వేల మందికి కరోనా టెస్ట్‌లు చేయాలని అధికారులు నిర్ణయించారు.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత