AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీకి మరో టెన్షన్.. కొత్తగా 48 కరోనా కేసులు.. ఒకరి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,  ఒకరు మ‌ృతి చెందారు. ఇదిలా ఉంటే,  ఇప్పుడు ఏపీని మరో టెన్షన్ వెంటాడుతోంది. రాష్ట్రంలోకి కొత్తగా వచ్చిన..

ఏపీకి మరో టెన్షన్.. కొత్తగా 48 కరోనా కేసులు.. ఒకరి మృతి
Jyothi Gadda
|

Updated on: May 26, 2020 | 11:46 AM

Share

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,148 శాంపిల్స్‌ను పరీక్షించగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఒకరు మృతిచెందారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2719కి చేరింది. కోవిడ్ బారిన పడి ఇప్పటివరకు మొత్తం 57 మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 759 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1903 మంది బాధితులు కోలుకున్నారు. ఈ రోజు కొత్తగా నమోదైనవాటిలో నాలుగు కేసులకు తమిళనాడులోని కోయంబేడుతో లింకులు ఉండగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కరోనాతో చనిపోయాడు. గత 24 గంటల్లో 55 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 650కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత స్థానంలో గుంటూరు జిల్లాలో 400కు పైగా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 57మంది చనిపోయారు. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఒకరు కన్నుమూశారు. తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోయంబేడు లింకులతో పాటూ విదేశాల నుంచి వచ్చిన వారితో కొత్త టెన్షన్ ఏపీని వెంటాడుతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన 111మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.

Follow Us
జూలైలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశులకు భారీ ధనలాభం, 4 రాశులు..
జూలైలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశులకు భారీ ధనలాభం, 4 రాశులు..
బెడ్‌రూమ్, కిచెన్ గోడలకు ఈ రంగులు వేస్తున్నారా? వెంటనే మార్చండి!
బెడ్‌రూమ్, కిచెన్ గోడలకు ఈ రంగులు వేస్తున్నారా? వెంటనే మార్చండి!
అటు యుద్ధపీడితమై... ఇటు ప్రకృతి వికృతించి.. ఎడాపెడా పరేషాన్లతో...
అటు యుద్ధపీడితమై... ఇటు ప్రకృతి వికృతించి.. ఎడాపెడా పరేషాన్లతో...
కారు లోన్‌పై EMIలు చెల్లించకపోతే బ్యాంకు కారును జప్తు చేయగలదా?
కారు లోన్‌పై EMIలు చెల్లించకపోతే బ్యాంకు కారును జప్తు చేయగలదా?
ఒక్క ఇటుక కదలకుండా ఇల్లంతా ట్రక్కులో ఎక్కించి తీసుకెళ్తున్నారు..
ఒక్క ఇటుక కదలకుండా ఇల్లంతా ట్రక్కులో ఎక్కించి తీసుకెళ్తున్నారు..
హైదరాబాద్ నుంచి వర్షాకాలంలో వెళ్లాల్సిన 8 బెస్ట్ వీకెండ్ ట్రిప్స్
హైదరాబాద్ నుంచి వర్షాకాలంలో వెళ్లాల్సిన 8 బెస్ట్ వీకెండ్ ట్రిప్స్
AI తర్వాత కొత్త టెక్నాలజీ.. సంచలనాలకు రెడీ
AI తర్వాత కొత్త టెక్నాలజీ.. సంచలనాలకు రెడీ
టెక్నాలజీతో వైద్య రంగంలో అద్భుతమైన మార్పులు
టెక్నాలజీతో వైద్య రంగంలో అద్భుతమైన మార్పులు
భర్తను లేపేసి ఏం తెలియనట్లు నటించింది.. కట్‌ చేస్తే..
భర్తను లేపేసి ఏం తెలియనట్లు నటించింది.. కట్‌ చేస్తే..
స్పైసీ గార్లిక్ చికెన్.. ఇలా చేస్తే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫిదా
స్పైసీ గార్లిక్ చికెన్.. ఇలా చేస్తే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫిదా