రోగనిరోధక శక్తి పెంపు: వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి బలమైన ఇమ్యూనిటీ అవసరం. పెరుగులో ఉండే విటమిన్ బి12, జింక్, ప్రోటీన్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
ప్రోబయోటిక్స్, గట్ హెల్త్: వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనపడే అవకాశం ఉంటుంది. పెరుగులో పుష్కలంగా ఉండే ప్రోబయోటిక్స్ పేగుల్లోని హానికర బ్యాక్టీరియాను నశింపజేసి, జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
సంక్రమణ వ్యాధుల నివారణ: వర్షాకాలం గాలి, నీటి ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్లకు నిలయం. పెరుగును ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రేగుల లోపలి పొర రక్షించబడి, హానికారక క్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి.
విటమిన్ డి, కాల్షియం సమృద్ధి: ఈ కాలంలో మబ్బుల వల్ల సూర్యరశ్మి తక్కువగా ఉండి శరీరానికి విటమిన్ డి లభ్యత తగ్గుతుంది. పెరుగులో లభించే సహజ కాల్షియం, పోషకాలు ఎముకలను, కండరాలను బలంగా ఉంచుతాయి.
పెరుగులోని గుణాలు మనం తినే ఇతర ఆహారాల్లోని పోషకాలను శరీరం త్వరగా గ్రహించేలా చేస్తాయి. రోజూ పరిమిత పరిమాణంలో పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు సరైన రీతిలో అంది, అంతర్గత ఆరోగ్యం, శక్తి మెరుగుపడతాయి.
వర్షాకాలంలో తరచుగా వచ్చే కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలకు పెరుగు అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. పెరుగు వల్ల కడుపులో మంట తగ్గి, ఆహారం త్వరగా అరిగి ఉపశమనం లభిస్తుంది.
వర్షాకాలంలో పెరుగు తినేటప్పుడు సమయం చాలా ముఖ్యం. రాత్రివేళల్లో పెరుగు తింటే కఫం లేదా జలుబు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యాహ్న భోజనంలో తాజా పెరుగును తీసుకోవడం వల్ల ఎలాంటి నెగెటివ్ ప్రభావం ఉండదు.
పెరుగు వల్ల చలువ చేసి జలుబు చేయకుండా ఉండేందుకు అందులో కొద్దిగా జీలకర్ర పొడి, నల్ల ఉప్పు లేదా సొంటి పొడిని కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమం జీర్ణక్రియను మరింత పెంచడమే కాకుండా, పెరుగులోని పోషకాలు శరీరానికి త్వరగా అబ్బేలా చేస్తుంది.
ఫ్రిజ్‌లో నుండి నేరుగా తీసిన చల్లటి పెరుగును గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం. దీనివల్ల గొంతు బొంగురుపోవడం, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి.