వరుస సినిమాలతో జోరుమీద అనుపమ పరమేశ్వరన్
08 August 2026
Pic credit - Instagram
Rajeev
దక్షిణాది సినీ పరిశ్రమలో తన సహజమైన నటన, అందం, చలాకీతనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక అనుపమ పరమేశ్వరన్.
మలయాళ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
2015లో వచ్చిన మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ద్వారా ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టారు అనుపమ పరమేశ్వరన్.
‘ప్రేమమ్’ విజయంతో అనుపమకు దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆమె త్వరగానే దగ్గరయ్యారు.
తెలుగులో ‘అ ఆ’, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి చిత్రాలతో ఆడియన్స్ కు దగ్గరయ్యారు.
కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథలు, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌లో తన పాత్రలకు తగినట్టుగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.
అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ దూసుకుపోతున్నారు అనుపమ. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ