AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026 వినాయక చవితి ఎప్పుడు? బొజ్జ గణపయ్య పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం ఇవే!

హిందువులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి యేడు ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. మరి, ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోనున్నారో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 08, 2026 | 2:22 PM

Share

1 / 5

ఈ గణేశ్‌ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్దశి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు. ఈ భాద్రపదమాసం వినాయకుడికి అంకితం చేయబడింది. ఈ మాసంలో గణపతిని పూజిస్తూ ఉంటారు. ఈ పండుగను అత్యంత శుభప్రదంగా కూడా హిందువులు భావిస్తారు. 2026 లో  వినాయక చవితి పండుగను వచ్చే నెల సెప్టెంబర్‌ 14వ తేదీ సోమవారం రోజున ఘనంగా భక్తులు జరుపుకోనున్నారు.

2 / 5
అయితే, సెప్టెంబర్‌ 14 నుంచి వినాయక విగ్రహాలను పెట్టి 11 రోజులు పూజలు చేస్తారు. అయితే, ఈ ఏడాది పండుగ సోమవారం రావడంతో వరుసగా మూడు రోజులు అంటే శని, ఆది, సోమవారం ఇలా మూడు రోజులు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 14, 2026 న పూజ ముహూర్తం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 1:31 వరకు పూజ చేసుకోవచ్చు.

3 / 5
ఆ రోజు కానీ, ముందు రోజు కానీ ఇంటిని శుభ్రం చేసి, గణేశుడి కోసం పూజ గదిని మండపంలా అలకంరించాలి. శుభ ముహూర్తంలో బొజ్జ గణపయ్య మట్టి విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకురండి. ప్రసాదం కోసం  మోదకాలు, కుడుములు , ఉండ్రాళ్లు వంటి వాటిని ప్రసాదంలా పెట్టండి. పూజ చేసిన రోజులు రోజూ  ఉదయం, సాయంత్రం హారతి ఇవ్వండి

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us