AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: క్రికెట్ లవర్స్‌కి బిగ్ సర్‌ప్రైజ్.. భారత్-శ్రీలంక టెస్ట్ మ్యాచ్‌ను ఫ్రీగా చూడొచ్చు!

IND vs SL: భారత్ vs శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండు టెస్టులను అభిమానులు ఉచితంగా స్టేడియంలో వీక్షించవచ్చు. గాల్, కొలంబో మ్యాచ్‌లకు ప్రత్యేక గేట్ల ద్వారా ప్రవేశం కల్పించనున్నారు.

IND vs SL: క్రికెట్ లవర్స్‌కి బిగ్ సర్‌ప్రైజ్.. భారత్-శ్రీలంక టెస్ట్ మ్యాచ్‌ను ఫ్రీగా చూడొచ్చు!
IND vs SL
Rakesh
|

Updated on: Aug 08, 2026 | 2:12 PM

Share

IND vs SL: భారత క్రికెట్ ప్రేమికులకు, శ్రీలంకలోని క్రీడాభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ (SLC) గుడ్ న్యూస్ అందించింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న భారత్ – శ్రీలంక రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో అభిమానులు ఎటువంటి టికెట్ ఫీజు చెల్లించకుండా ఉచితంగా స్టేడియంలోకి ప్రవేశించి మ్యాచ్‌ను వీక్షించవచ్చని అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ స్థాయి క్రికెట్ వినోదాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించే అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.

మ్యాచ్ షెడ్యూల్, స్టేడియం గేట్ల వివరాలు

ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15 నుంచి గాలో లో ప్రారంభం కానుండగా, రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది. ఈ మ్యాచ్‌లను వీక్షించడానికి శ్రీలంక క్రికెట్ బోర్డ్ ప్రత్యేక ప్రవేశ మార్గాలను కేటాయించింది. గాలో క్రికెట్ స్టేడియంలో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం అభిమానులు గేట్ నంబర్ 4 ద్వారా ఉచితంగా ప్రవేశించవచ్చు. అలాగే కొలంబోలోని ఎస్ఎస్సీ స్టేడియంలో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం గేట్ నంబర్లు 3, 4, 5, 7ల ద్వారా అభిమానులను లోపలికి అనుమతిస్తారు. గత కొన్నేళ్లుగా టెస్ట్ మ్యాచ్‌లకు ప్రేక్షకులు తగ్గడంతో పాటు, మైదానాలు ఖాళీగా కనిపిస్తుండటంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

మూడు రోజుల వార్మప్ మ్యాచ్ విశేషాలు

టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ప్రస్తుతం కొలంబోలోని ఎన్సీసీ స్టేడియంలో టీమిండియా, శ్రీలంక XI జట్ల మధ్య మూడు రోజుల వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక XI జట్టు 363 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టులో యశస్వి జైస్వాల్ పరుగులేమీ చేయకుండానే అవుట్ కాగా, మరో యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తనకు లభించిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని అర్ధసెంచరీతో రాణించాడు.

టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు వివరాలు

శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సారాంశ్ జైన్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us