తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్..

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్..

కరోనా వైరస్ దాటికి ఈ నెల 30 వరకు లాక్ డౌన్‌ను పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాక త్వరలోనే పదో తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ నేపధ్యంలో విద్యార్ధులకు ఓ గుడ్ న్యూస్ అందించింది. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రసార మాధ్యమాల ద్వారా ఆన్లైన్ తరగతులను బోధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే దూరదర్శన్ యాదగిరి ఛానల్‌లో ఇవాళ్టి నుంచి ప్రతీరోజూ ఉదయం 10 గంటల నుంచి 11 […]

Ravi Kiran

|

Apr 12, 2020 | 8:09 AM

కరోనా వైరస్ దాటికి ఈ నెల 30 వరకు లాక్ డౌన్‌ను పొడిగించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాక త్వరలోనే పదో తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ నేపధ్యంలో విద్యార్ధులకు ఓ గుడ్ న్యూస్ అందించింది. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రసార మాధ్యమాల ద్వారా ఆన్లైన్ తరగతులను బోధించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే దూరదర్శన్ యాదగిరి ఛానల్‌లో ఇవాళ్టి నుంచి ప్రతీరోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆన్లైన్ తరగతులు ప్రసారం కానున్నాయి. మ్యాథ్స్‌, సైన్స్‌ సబ్జెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన లాంగ్వేజెస్‌లను కూడా బోధించేలా టైం టేబుల్‌ను రూపొందించారు. కాగా, ఈ నెలాఖరుకు కరోనా వ్యాప్తి కట్టడిలోకి వస్తే దశల వారీ లాక్ డౌన్ ఎత్తివేస్తామని సీఎం కేసిఆర్ నిన్న ప్రెస్ మీట్‌లో తెలియజేసిన విషయం విదితమే.

ఇది చదవండి: ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu