అమెరికాలో కరోనా ఉగ్రరూపం.. 40 మంది భారతీయులు మృతి..

ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అమెరికా.. అలాంటి అగ్రరాజ్యం కరోనా వైరస్ మహమ్మారికి విలవిల్లాడుతున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో వారు చేస్తున్న ఈ పోరాటంలో మృత్యుఘోష తప్పడం లేదు. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,830 మంది చనిపోయారు. దీనితో అక్కడ మరణాల సంఖ్య 20,577కి చేరింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధికంగా ఇటలీలో 19,468 కరోనా మరణాలు చోటు చేసుకోగా.. అగ్రరాజ్యం ఆ మార్క్‌ను […]

అమెరికాలో కరోనా ఉగ్రరూపం.. 40 మంది భారతీయులు మృతి..
Follow us

|

Updated on: Apr 12, 2020 | 4:17 PM

ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అమెరికా.. అలాంటి అగ్రరాజ్యం కరోనా వైరస్ మహమ్మారికి విలవిల్లాడుతున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో వారు చేస్తున్న ఈ పోరాటంలో మృత్యుఘోష తప్పడం లేదు. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,830 మంది చనిపోయారు. దీనితో అక్కడ మరణాల సంఖ్య 20,577కి చేరింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధికంగా ఇటలీలో 19,468 కరోనా మరణాలు చోటు చేసుకోగా.. అగ్రరాజ్యం ఆ మార్క్‌ను అధిగమించింది. ఇక అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 532,879 చేరింది.

ఇదిలా ఉంటే అమెరికాలో ఉంటున్న భారతీయులు, భారత సంతతికి చెందిన వారిలో సుమారు 40 మంది కరోనా వల్ల మృతి చెందారు. అంతేకాక మరో 1,500 మందికి ఈ కోవిడ్ 19 సోకింది. మృతుల్లో కేరళకు చెందిన 17 మందితో పాటు ఆంధ్రప్రదేశ్ 2, ఒడిశా 1, గుజరాత్‌కు చెందిన 10 మంది, పంజాబ్‌కు చెందిన నలుగురు చనిపోయినట్లు భారతీయ సంస్థల వారు వెల్లడించారు. అటు న్యూజెర్సీలో ఉంటున్న 400 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా.. అమెరికాలో ఉంటున్న 1000 మందికి పాజిటివ్ తేలిందని అక్కడి భారతీయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇక న్యూయార్క్‌లో అయితే కరోనా బారిన ఎక్కువగా ట్యాక్సీ డ్రైవర్లు పడ్డారని తెలిపారు.

ఇది చదవండి: తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్..