తెలంగాణలో 20 మంది చిన్నారులకు కరోనా..
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 20 మంది 12 ఏళ్లలోపు చిన్నారులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ చిన్నారులను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి.. ఐసీఎంఆర్ నిబంధనలు ప్రకారం ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. కాగా, వైరస్ సోకిన వారిలో 23 రోజుల పసికందు నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారుల వరకు ఉన్నారని వైద్యాధికారులు తెలిపారు. వీరందరికీ గాంధీ ఆసుపత్రిలోని ఆరో ఫ్లోర్‌లో చికిత్స అందిస్తున్నారు. […]

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 20 మంది 12 ఏళ్లలోపు చిన్నారులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ చిన్నారులను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచి.. ఐసీఎంఆర్ నిబంధనలు ప్రకారం ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.
కాగా, వైరస్ సోకిన వారిలో 23 రోజుల పసికందు నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారుల వరకు ఉన్నారని వైద్యాధికారులు తెలిపారు. వీరందరికీ గాంధీ ఆసుపత్రిలోని ఆరో ఫ్లోర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 118 మంది కరోనా నుంచి బయటపడ్డారు. మరో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 514 యాక్టివ్ కేసులున్నాయి. అయితే వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఉన్న మొత్తం కేసుల్లో సగానికి పైగా నగరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Media Bulletin Date: April 15, 2020
District wise status update on #Coronavirus positive cases in Telangana pic.twitter.com/OwhPnYb3mK
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 15, 2020
