AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎబోలా డ్రగ్‌తో కరోనాను నయం చేయవచ్చు.. ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే.?

యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యులు, పరిశోధకులు విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇక వారు చేసే ప్రయోగాలన్నీ కూడా కీలక దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా మరికొందరు శాస్త్రవేత్తలు అయితే కరోనా చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుంచి ఆరు ఔషధాలను గుర్తించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కరోనాను నయం చేసేందుకు ఎబోలా డ్రగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ […]

ఎబోలా డ్రగ్‌తో కరోనాను నయం చేయవచ్చు.. ఐసీఎంఆర్ ఏం చెప్పిందంటే.?
Ravi Kiran
|

Updated on: Apr 15, 2020 | 10:56 PM

Share

యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యులు, పరిశోధకులు విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇక వారు చేసే ప్రయోగాలన్నీ కూడా కీలక దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా మరికొందరు శాస్త్రవేత్తలు అయితే కరోనా చికిత్సకు సహాయపడే 10,000 కంటే ఎక్కువ సమ్మేళనాల నుంచి ఆరు ఔషధాలను గుర్తించారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కరోనాను నయం చేసేందుకు ఎబోలా డ్రగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎబోలా వైరస్ చికిత్సకు ఉపయోగించిన ‘రెమెడెసివర్‌’ డ్రగ్ కరోనాపై ప్రభావం చూపగలదని ఆయన అన్నారు. గిలియడ్ సైన్స్ ఇంక్ సంస్థ తయారు చేసిన ఈ ప్రయోగాత్మక మందు ప్రారంభ దశలో మంచి రిజల్ట్స్ చూపిస్తోందన్నారు. అటు వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు కరోనా పేషంట్లలో ఇద్దరికీ ఈ ‘రెమెడెసివర్‌’ డ్రగ్ పని చేసినట్లు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ అఫ్ మెడిసిన్ ఓ నివేదికను ప్రచురించిందని గంగాఖేడ్కర్ తెలిపారు.

“ఎబోలా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉపయోగించిన ‘రెమెడెసివర్‌’.. కోవిడ్ -19 వైరస్ మ్యుటేషన్‌పై పని చేస్తోంది. అందువల్లే పరిశోధకులు ఈ డ్రగ్ కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.” అయితే ఇది క్లినికల్ ట్రయిల్ కాదని.. కేవలం పరిశీలనాత్మక అధ్యయనం మాత్రమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఈ డ్రగ్ ఇచ్చిన కొందరి వ్యక్తులను పరిశీలించగా.. 68 శాతం.. లేదా ముగ్గురులో ఇద్దరు పేషంట్లకు ఈ మందు తర్వాత వెంటిలేటర్ సాయం అవసరం లేదని తేలింది. కాగా, గిలియడ్ సంస్థ తయారు చేసిన ఈ డ్రగ్ ట్రయిల్స్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఐసీఎంఆర్ కూడా పాల్గొంటోంది. భారత్‌లో ప్రస్తుతం ఈ రెమెడెసివర్‌ అందుబాటులో లేదని ఐసీఎంఆర్ చెప్పింది. ఏదైనా ఫార్మా సంస్థ దీనిని తయారు చేస్తే చికిత్సకు వాడొచ్చని వెల్లడించింది.

Follow Us
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..