తెలంగాణ వాసులకు కాస్త ఊరట.. నేడు భారీగా తగ్గిన కేసులు..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా మంగళవారం వరకు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రజలంతా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే బుధవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కరోనా కేసుల తాజా బులిటెన్ కాస్త ఊరటనిచ్చింది. బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు కేవలం ఆరు మాత్రమే నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. అంతేకాదు.. బుధవారం రోజు కరోనాను జయించి..మరో […]

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా మంగళవారం వరకు పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రజలంతా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే బుధవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కరోనా కేసుల తాజా బులిటెన్ కాస్త ఊరటనిచ్చింది.
బుధవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు కేవలం ఆరు మాత్రమే నమోదైనట్లు తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. అంతేకాదు.. బుధవారం రోజు కరోనాను జయించి..మరో 8 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 118 మంది కరోనా నుంచి బయటపడ్డారు. మరో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 514 యాక్టివ్ కేసులున్నాయి. అయితే వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఉన్న మొత్తం కేసుల్లో సగానికి పైగా నగరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana .@TelanganaHealth pic.twitter.com/4HF66O1wl2
— IPRDepartment (@IPRTelangana) April 15, 2020