దారుణం.. కరోనా పేషంట్‌ను తీసుకెళ్తుండగా.. అంబులెన్స్‌పై రాళ్లదాడి..
యూపీలో దారుణ ఘటనచోటుచేసుకుంది. మొరదాబాద్‌లోని హజీ నెబ్ మసీదు ప్రాంతంలో.. ఓ కరోనా పేషేంట్స్‌తో వెళ్తున్న అంబులెన్స్‌పై అల్లరిమూకలు మూకదాడికి దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వైద్య సిబ్బందితో పాటు.. పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. అదే ప్రాంతంలోని ఓ ఇంటిలో కరోనా పాజిటివ్‌తో ఓ వ్యక్తి మరణించాడు. అయితే అతని కుటుంబ సభ్యులను 108 వ్యానులో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా, రెండు పోలీసు వాహనాలు ఆ అంబులెన్స్ వెంట సెక్యూరిటీగా వెళ్తున్నాయి. అయితే ఈ క్రమంలో అల్లరిమూకలు.. […]

యూపీలో దారుణ ఘటనచోటుచేసుకుంది. మొరదాబాద్‌లోని హజీ నెబ్ మసీదు ప్రాంతంలో.. ఓ కరోనా పేషేంట్స్‌తో వెళ్తున్న అంబులెన్స్‌పై అల్లరిమూకలు మూకదాడికి దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వైద్య సిబ్బందితో పాటు.. పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. అదే ప్రాంతంలోని ఓ ఇంటిలో కరోనా పాజిటివ్‌తో ఓ వ్యక్తి మరణించాడు. అయితే అతని కుటుంబ సభ్యులను 108 వ్యానులో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా, రెండు పోలీసు వాహనాలు ఆ అంబులెన్స్ వెంట సెక్యూరిటీగా వెళ్తున్నాయి. అయితే ఈ క్రమంలో అల్లరిమూకలు.. అంబులెన్స్,పోలీస్ వాహనాలపై రాళ్ల దాడికి దిగాయి. దీంతో వాహనాల అద్దాలు పగిలిపోయాయి. అంతేకాదు.. ఇద్దరు వైద్య సిబ్బందితో పాటు.. పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందకున్న ఉన్నతాధికారులు.. ఈ ప్రాంతానికి అదనపు బలగాలను పంపి.. పరిస్థితిని చక్కదిద్ది ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. అంబులెన్స్ డ్రైవర్ తెలిపిన ప్రకారం.. ఇది పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసినట్లు అర్దమవుతుందని.. తాము పేషెంటును అంబులెన్స్‌లో ఎక్కిస్తున్న సమయంలో లోనే.. ఓ గుంపు హఠాత్తుగా తమపై రాళ్ల దాడి జరిపిందని..ఈ దాడిలో డాక్టర్లతో పాటు తాము కూడా గాయపడ్డామని అంబులెన్స్ డ్రైవరు పేర్కొన్నాడు.