ఇంటర్ నెట్‌లో నకిలీ ఫ్లిప్ కార్ట్ సైట్.. క్లిక్ చేశారా అకౌంట్ ఖాళీనే
లాక్ డౌన్ పీరియడ్‌లో నకిలీ గాళ్ళు రెచ్చిపోతున్నారు. పేరున్న కంపెనీల పేరుతో, పేరు మోసిన వ్యాపార లావాదీవీల పేరుతోనే జనాన్ని ముంచేందుకు బమార్గాలను వెతుక్కుంటున్నారు. ఇదే రకంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ పేరిట ఇంటర్ నెట్‌లో ఓ నకిలీ వెబ్ సైట్ వెలిసింది.

లాక్ డౌన్ పీరియడ్‌లో నకిలీ గాళ్ళు రెచ్చిపోతున్నారు. పేరున్న కంపెనీల పేరుతో, పేరు మోసిన వ్యాపార లావాదీవీల పేరుతోనే జనాన్ని ముంచేందుకు బమార్గాలను వెతుక్కుంటున్నారు. ఇదే రకంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ పేరిట ఇంటర్ నెట్‌లో ఓ నకిలీ వెబ్ సైట్ వెలిసింది. ఎడాపెడా డిస్కౌంట్లను ప్రకటిస్తూ జనాన్ని మోసం చేసేందుకు రంగం సిద్దం చేసుకుంది. నకిలీ యూఆర్‌ఎల్ రూపొందించి.. దాని ఆధారంగా ఆఫర్లను ప్రకటిస్తూ ప్రచారం చేసుకుంటున్న సైబర్ చీటర్స్ అందినకాడికి దోచుకుంటున్నారు. ఏకంగా 90 నుంచి 95 శాతం డిస్కౌంట్ అంటూ ఎర వేస్తున్నారు. ఈ సైట్‌ను నమ్మి మోసపోయిన ఓ వ్యక్తి బుధవారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో ఈ మోసం వెలుగు చూసింది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
అత్యంత ఆకర్షనీయంగా రూపొందిన ఈ వెబ్‌సైట్ పట్ల ఎవరైనా ఆకర్షితులై క్లిక్ చేస్తే అది నేరుగా సైబర్ నేరగాళ్లు ఏర్పాటు చేసిన నకిలీ వెబ్ సైట్‌లోకి తీసుకువెళుతుంది. అక్కడ అనేక ఖరీదైన ఫోన్లు 90 నుంచి 95 శాతం వరకు తగ్గించి విక్రయిస్తున్నామంటూ ఆ ఫోన్ల ఫొటోలతో సహా డిస్ ప్లే అవుతున్నాయి. కొందరు ఆ సైట్‌లోనే ఫోన్లు బుక్ చేసి, అమౌంట్ కూడా పంపిస్తున్నారు. ఎంతకూ ఫోన్లు రాకపోగా ఆరా తీయడంతో మోసపోయినట్టు తెలుసుకుంటున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 2900 రూపాయలు పోగొట్టుకుని బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ గంగాధర్ దర్యాప్తు ప్రారంభించారు.
ఈ తరహా నకిలీ సైట్లు మరికొన్ని ఉంటాయని, లావాదేవీలు చేసే ముందు సరిచూసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు. సైబర్ నేరగాళ్లు మరో ముగ్గురిని కూడా ఇదే తరహాలో మోసం చేశారు. ఈ ముగ్గురు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసులు నమోదయ్యాయి. నగరంలో పనిచేస్తున్న ఓ ఆర్మీ అధికారికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు తక్కువ వడ్డీకి రుణం ఇస్తామంటూ ఎర వేసి 79 వేల రూపాయలు కాజేశారు. ప్రాసెసింగ్ ఫీజుతో పాటు వివిధ చార్జీల పేరుతో ఆయన నుంచి మనీ కొట్టేశారు.
ఆన్‌లైన్‌లో చూసి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఇంకో మహిళ నుంచి సైబర్ చీటర్స్ ఏకంగా 49 వేల రూపాయలు కాజేశారు. ముషీరాబాద్‌కు చెందిన ఓ యువకుడు తన వద్ద ఉన్న పాత బెడ్ అమ్మేస్తానని ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. ఓ సైబర్ నేరగాడు 9 వేల రూపాయలకు తాను కొనుగోలు చేస్తానని ముందుకొచ్చాడు. గూగుల్ పే అకౌంట్ చెక్ చేయాలంటూ ముందుగా తనకు నాలుగు వేల రూపాయలుపంపుమన్నాడు. నమ్మిన సదరు వ్యక్తు నాలుగు వేల రూపాయలు పంపించాడు. ఆ తర్వాత మొత్తం 13 వేల రూపాయలు తనకు వస్తాయని ఆశపడ్డాడు. ఆ తర్వాత మొత్తం 13 వేల రూపాయలు చెల్లిస్తున్నానంటూ సైబర్ నేరగాడు ఓ క్యూఆర్ కోడ్‌ను పంపాడు. దానికి పైన ఉన్న టెక్స్ట్ చూసి.. తనకు మనీ వస్తున్నాయనుకుని క్లిక్ చేశాడు. కానీ రివర్స్‌లో తన అకౌంట్ నుంచే ఏకంగా 61 వేల రూపాయలు ఆ సైబర్ చీటర్ అకౌంట్‌కు వెళ్ళిపోయాయి. ఈ తరహా మోసాలు లాక్ డౌన్ రోజుల్లో పెరిగిపోయాయంటున్న పోలీసులు అప్రమత్తంగా వుండాలని ప్రజలకు సూచిస్తున్నారు.