‘కరోనా’ అంటూ ఆఫీసుకు డుమ్మా.. 3 నెలలు జైలు శిక్ష..!

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనాతో యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలో తెలియక దేశాధినేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ వైరస్ వలన 5,429 మంది మృత్యువాతపడగా.. 1,45,379 మంది బాధితులు పోరాటం చేస్తున్నారు.

'కరోనా' అంటూ ఆఫీసుకు డుమ్మా.. 3 నెలలు జైలు శిక్ష..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 14, 2020 | 5:05 PM

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనాతో యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలో తెలియక దేశాధినేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ వైరస్ వలన 5,429 మంది మృత్యువాతపడగా.. 1,45,379 మంది బాధితులు పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వైరస్ పేరు వినగానే అందరిలో భయం పుట్టుకొస్తోంది. అయితే పని తప్పించుకోవడం కోసం ఆ వైరస్‌ను అడ్డుగా పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఆఫీసుకు డుమ్మా కొట్టడం కోసం తనకు కోవిడ్ 19 సోకిందంటూ చెప్పాడు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకుంటున్నాడు ఆ వ్యక్తి.

వివరాల్లోకి వెళ్తే.. చైనాలో ఓ ఉద్యోగి పని నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసుకున్నాడు. దీంతో తనకు కరోనా వైరస్ పాజిటివ్ ఉందంటూ యాజమాన్యాన్ని ఫోన్ చేసి చెప్పాడు. ఈ నేపథ్యంలో యాజమాన్యం అతడికి సెలవు ఇచ్చింది. మరోవైపు అతడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే సదరు వ్యక్తి పనిచేసే ఆఫీసులో భయాందోళనలు నెలకొన్నాయి. మూడు రోజుల పాటు సిబ్బందికి సెలవులు ఇచ్చి ఆఫీసు మొత్తాన్ని శుభ్రపరిచారు. ఆ తరువాత తమ సంస్థలోని ఓ ఉద్యోగికి కరోనా సోకిందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతడికి వ్యాధి ఎలా సోకింది..? అతడు ఏయే ప్రాంతాల్లో తిరిగాడు..? ఎవరిని కలిశాడు..? అనే వివరాలపై ఆరా తీసి.. వారిని చికిత్సకు తరలించాలని భావించారు. ఈ క్రమంలో అతడికి ఇంటికి వెళ్లారు. విచారణలో భాగంగా అతడికి కరోనా వైరస్ లేదని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో పోలీసులు, సంస్థను తప్పుదోవ పట్టించినందుకు గానూ ఆ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష పడింది.

Read This Story Also: త్రిష ఔట్.. కలిసొచ్చిన హీరోయిన్‌తో రెండోసారి చిరు.!