లండన్‌లో.. అప్పుడే పుట్టిన నవజాత శిశువుకు కరోనా..!

చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. లండన్‌లో అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా నిర్ధారణ అయింది. కరోనా బాధితుల్లో అత్యంత పిన్న వయస్కుడు ఈ శిశువే కావడం ఆందోళన కలిగించే

లండన్‌లో.. అప్పుడే పుట్టిన నవజాత శిశువుకు కరోనా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 14, 2020 | 4:45 PM

Covid 19: చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రారంభమైన కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. లండన్‌లో అప్పుడే పుట్టిన శిశువుకు కరోనా నిర్ధారణ అయింది. కరోనా బాధితుల్లో అత్యంత పిన్న వయస్కుడు ఈ శిశువే కావడం ఆందోళన కలిగించే విషయం. న్యుమోనియా వచ్చిందేమోనన్న అనుమానంతో ప్రసవానికి కొద్ది గంటల ముందే తల్లిని నార్త్ మిడిల్‌సెక్స్ ఆసుపత్రికి తలరించాల్సి వచ్చింది. పరిస్తితి తెలుసుకున్న డాక్టర్లు వెంటనే ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈలోపే ఆమె ప్రసవించింది.

కాగా.. టెస్టుల్లో ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ అవ్వడంతో వెంటనే డాక్టర్లు నవజాత శిశువుకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ ‌టెస్టులోనూ పాజిటివ్ అని తేలడంతో తల్లిని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. బిడ్డకు అదే ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. అయితే గర్భంలో ఉండగా కరోనా వైరస్ సోకిందా లేక ప్రసవం తరువాతా అనే ఇంకా తేలాల్సి ఉంది. కాగా.. లండన్‌లో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ 136 మంది బాధితులకు చికిత్సను అందిస్తున్నట్టు సమాచారం.

Also Read : ఐపీఎల్‌ 2020: ఏప్రిల్‌ 20 తుది గడువు.. అలాకాకుంటే..?