‘మిరాకల్‌ బేబీ’.. కరోనాను జయించిన ఈ చిన్నారి కథ తెలిస్తే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతోంది. అందులో నెలల పిల్లలు కూడా చాలా మందే ఉన్నారు.

'మిరాకల్‌ బేబీ'.. కరోనాను జయించిన ఈ చిన్నారి కథ తెలిస్తే..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 27, 2020 | 9:34 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతోంది. అందులో నెలల పిల్లలు కూడా చాలా మందే ఉన్నారు. వారిలో చాలామంది కోలుకున్నారు కూడా. కాగా లండన్‌లో ఇటీవల ఆరు నెలల ఎరిన్ అనే చిన్నారి కరోనాను జయించింది. రెండు వారాల ఐసోలేషన్ తరువాత ఆ చిన్నారిని ఆదివారం వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా వైద్యులందరూ ఎరిన్‌ను అభినందించారు.

https://www.facebook.com/prideofbritain/photos/a.222461064466188/2935468483165419/?type=3&theater

అయితే పుట్టినప్పటి నుంచే ఎరిన్‌ గుండె సంబంధ సమస్యలతో బాధపడుతుండగా.. రెండు నెలల క్రితం(గతేడాది డిసెంబర్‌లో) ఆమెకు హార్ట్ సర్జరీ జరిగింది.  ఇక నాలుగు నెలల తరువాత మళ్లీ కరోనా బారిన పడింది ఎరిన్. వైద్యుల సేవతో.. దేవుడి ఆశీస్సులతో ఈ చిన్నారి రెండు వారాల తరువాత మహమ్మారిని జయించింది. ఇక ఈ విషయాన్ని ద ప్రైడ్ ఆఫ్ బ్రిటన్ అవార్డ్స్ సంస్థ ట్వీట్ చేస్తూ.. పుట్టినప్పుడే హృదయ ఇబ్బందులు ఉన్న ఆరు నెలల ఎరిన్ కరోనాను జయించింది. రెండు వారాల ఐసోలేషన్ తరువాత కోలుకున్న ఎరిన్‌ను చూసి వైద్యులు భావోద్వేగంతో చప్పట్లు కొట్టి అభినందించారు. తన బిడ్డకు సేవలందించిన వారిని ఎప్పటికీ మర్చిపోలేమని ఎరిన్ తల్లి ఎమ్మా తెలిపింది అని తెలిపింది. కాగా ఎరిన్‌ డిశ్చార్జ్ అయ్యే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిన్నారి కథను తెలుసుకున్న నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక ఎరిన్ గురించి తండ్రి మాట్లాడుతూ.. ఆమె కోలుకొని మా జీవితంలో మళ్లీ నవ్వులు తీసుకొచ్చింది అని తెలిపారు.

Read This Story Also: Breaking: క్వారంటైన్ నుంచి వచ్చిన 15 నెలల చిన్నారికి ‘కరోనా’ పాజిటివ్‌..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu