Breaking: క్వారంటైన్ నుంచి వచ్చిన 15 నెలల చిన్నారికి ‘కరోనా’ పాజిటివ్‌..!

ఏపీలో కరోనా విజృంభణ ఆగడం లేదు. తాజాగా క్వారంటైన్ నుంచి వచ్చిన 15 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ సంఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

Breaking: క్వారంటైన్ నుంచి వచ్చిన 15 నెలల చిన్నారికి 'కరోనా' పాజిటివ్‌..!
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 8:21 PM

ఏపీలో కరోనా విజృంభణ ఆగడం లేదు. తాజాగా క్వారంటైన్ నుంచి వచ్చిన 15 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ సంఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్పరి మండలం జోహారాపురం గ్రామంలో 15 నెలల చిన్నారికి కరోనా సోకింది. ఈ చిన్నారి  మామకు గతంలో కరోనా పాజిటివ్ సోకగా.. అతడితో పాటు మరో 10 మందిని గత 15 రోజులక్రితం కర్నూలు ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. కర్నూలు ఐసోలేషన్ సెంటర్‌లో ఉన్న వారిని కరోనా వైరస్ లేదని ఆదివారం రాత్రి సొంత గ్రామంకు వైద్య సిబ్బంది పంపింది. అయితే మరోమారు జరిపిన రక్త పరీక్షల్లో చిన్నారికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ చిన్నారి కోసం కర్నూలు కరోనా ఐసోలేషన్ సెంటర్ వైద్య సిబ్బంది జోహాపురంకు వెళ్లారు. కాగా కర్నూలు కరోనా ఐసోలేషన్ సెంటర్ వైద్య సిబ్బంది తీరుపై చిన్నారి కుటుంబసభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినం చేయనున్నారు.

Read This Story Also: చిరు, వెంకీ, నాగ్‌తో ‘బడా’ మల్టీస్టారర్‌.. కథ రెడీ అవుతుందా..!