వారికి ఉచితంగా కోవిడ్ పరీక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలు అందిస్తున్న ప్రతి ఉద్యోగికి ఉచితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో మే 3వరకు కంటోన్మెంట్ జోన్లలో నిబంధనలు అమలవుతాయని అన్నారు. ఇక కూరగాయలు అత్యవసరమైతే స్విగ్గీ హోం డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చునని ప్రజలకు సూచించారు. కాగా, ఇప్పటివరకు […]

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలు అందిస్తున్న ప్రతి ఉద్యోగికి ఉచితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో మే 3వరకు కంటోన్మెంట్ జోన్లలో నిబంధనలు అమలవుతాయని అన్నారు. ఇక కూరగాయలు అత్యవసరమైతే స్విగ్గీ హోం డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చునని ప్రజలకు సూచించారు. కాగా, ఇప్పటివరకు 11,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం 11,265 మెడికల్ కిట్లు వచ్చాయని, అదనంగా ఇంకో 16 వేల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.
Read Also:
కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..
హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!
డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..
‘పిల్లో ఛాలెంజ్’ కాదు భామలు.. ఫస్ట్ ఈమెను చూసి నేర్చుకోండి..




