కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..

దాయాది పాకిస్తాన్ లో మతం అనేది చాలా సున్నితమైన అంశం. అక్కడ ముస్లింలు, మత పెద్దలు, ఇమామ్ లు చెప్పినట్లుగానే కొన్నిసార్లు పాక్ ప్రభుత్వం చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే రంజాన్ వేళ పలు షరతులతో మసీదులను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు పాక్ ప్రధాని. అయితే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ వాటిని తెరవడంతో.. దానికి తగిన మూల్యం చెల్లిస్తున్నారు. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇక పాకిస్తాన్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ కూడా […]

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..
Follow us

|

Updated on: Apr 27, 2020 | 2:32 PM

దాయాది పాకిస్తాన్ లో మతం అనేది చాలా సున్నితమైన అంశం. అక్కడ ముస్లింలు, మత పెద్దలు, ఇమామ్ లు చెప్పినట్లుగానే కొన్నిసార్లు పాక్ ప్రభుత్వం చేస్తుంది కూడా. ఈ క్రమంలోనే రంజాన్ వేళ పలు షరతులతో మసీదులను తెరిచేందుకు అనుమతి ఇచ్చారు పాక్ ప్రధాని. అయితే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ వాటిని తెరవడంతో.. దానికి తగిన మూల్యం చెల్లిస్తున్నారు. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇక పాకిస్తాన్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ కూడా మసీదులను తెరవడం వల్లే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

గత ఆరు రోజుల్లో పాకిస్తాన్ లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ 13,328 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ బారిన పడి 281 మంది మృతి చెందారు. అంతేకాకుండా అక్కడ 200 మంది వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఇక ముస్లిం మత పెద్దల అల్టిమేటం వల్ల ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మసీదులపై నిషేధాన్ని ఎత్తివేశారని.. దీనితో సామూహిక ప్రార్ధనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. అందుకే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని పీఐఎంఏ ప్రెసిడెంట్ వెల్లడించారు. కాగా, రంజాన్ వేళ మసీదులు తెరుచుకునేందుకు పాక్ ప్రభుత్వం పలు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సామాజిక దూరాన్ని తప్పనిసరి చేస్తూ.. సామూహిక ప్రార్ధనలు చేయకూడదని, అలాగే ప్రార్ధన చేసే చాపను ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలంటూ పలు సూచనలు చేసింది.

Read Also:

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..

డేంజర్ బెల్స్: మే 18 వరకు లాక్ డౌన్ పొడిగింపు..!

ఇల్లు చేరుకోవడానికి కూలీ మాస్టర్ ప్లాన్.. 25 వేల కేజీల ఉల్లితో..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..