తెలంగాణలో కొత్తగా మరో 21 పాజిటివ్ కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు నలభై వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక వీరిలో పది వేల మందికి పైగా కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం కొత్తగా 21 మందికి కరోనా పాజిటివ్‌గా […]

తెలంగాణలో కొత్తగా మరో 21 పాజిటివ్ కేసులు
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 9:45 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు నలభై వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక వీరిలో పది వేల మందికి పైగా కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం కొత్తగా 21 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులు 1082కి చేరాయి. ఇక ఆదివారం కరోనా నుంచి జయించి 46 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 545కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 508 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కాగా.. ఆదివారం నాడు నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 20 నమోదవ్వగా.. ఒక కేసు జగిత్యాల జిల్లా నుంచి నమోదైనట్లు పేర్కొన్నారు.