AP Corona Cases: మరోసారి ఏపీలో పడగ విప్పిన కోవిడ్ రక్కసి.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే.!
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రెండు వేలకు చేరువగా ఉంది. రోజు రోజుకు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 1730 కరోనా కేసులు..
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రెండు వేలకు చేరువగా ఉంది. రోజు రోజుకు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 1730 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,04,781కి చేరింది. ఇందులో 10,300 యాక్టివ్ కేసులు ఉండగా.. 887242 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 7,239కు చేరుకుంది. ఇక నిన్న 842 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,52,08,436 సాంపిల్స్‌ను పరీక్షించారు. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 31,072 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 378 .. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 27 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 04/04/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,04,781 పాజిటివ్ కేసు లకు గాను *8,87,242 మంది డిశ్చార్జ్ కాగా *7,239 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,300#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/ytYEJTuF8y
— ArogyaAndhra (@ArogyaAndhra) April 4, 2021
Vakeel Saab Pre Release Live: