AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Reviewed: రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌..! కరోనా కట్టడి ఈ నియమాలు తప్పనిసరి..

కరోనా కేసుల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అవుతోంది. ఇప్పటికే ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను హైఅలర్ట్‌ చేసింది కేంద్ర ప్రభుత్వం. అటు దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి పెరుగుతుండడంతో...

PM Modi Reviewed: రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌..! కరోనా కట్టడి ఈ నియమాలు తప్పనిసరి..
Corona Virus
Sanjay Kasula
|

Updated on: Apr 04, 2021 | 9:31 PM

Share

కరోనా కేసుల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అవుతోంది. ఇప్పటికే ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను హైఅలర్ట్‌ చేసింది కేంద్ర ప్రభుత్వం. అటు దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి పెరుగుతుండడంతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్​ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయించారు. కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్​ ప్రక్రియ గురించి సమీక్షించారు. మహారాష్ట్రలో వైరస్​ ఉద్ధృతి తీవ్రంగా ఉన్నందున కేంద్ర బృందాలను ఆ రాష్టానికి పంపాలని నిర్ణయించారు.

పంజాబ్, ఛత్తీస్‌గడ్‌లకు కూడా కేంద్ర బృందాలను పంపాలని ప్రధాని ఆదేశించారు. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు.. కరోనా జాగ్రత్తలు, మాస్క్​ వాడకంపై రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఢిల్లీలో ప్రధాని నిర్వహించిన రివ్యూలో కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి సహా సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రాలు, జిల్లాల్లో టీకా పంపిణీ కార్యక్రమం ఎలా సాగుతోంది..? ఇప్పటి వరకు ఎంతమందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు..? ఏయే రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి ఉంది..? కరోనా కేసులు ఎక్కువగా కొన్ని రాష్ట్రాల్లోనే ఎందుకు పెరుగుతున్నాయి..? ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమా..? కోవిడ్‌ రక్షణ చర్యలు తీసుకోకపోవడమా..? వంటి అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా విపరీతంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగినట్టు సమాచారం.

దేశ వ్యాప్తంగా రోజురోజు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93వేల 249 కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌ తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచే 822 శాతం కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరో వైపు దేశంలో 50 శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయని అంచనా. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ వ్యాప్తి ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వారాంతపు లాక్​డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో ఆదివారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరిగింది. కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించింది. తర్వాత కఠిన ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలు విడుదల చేశారు. సోమవారం నుంచి రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ అమలులోకి రానున్నది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది.

ఇక.. వారాంతాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తారు. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఇది అమలులో ఉంటుంది. వారాంతరాల్లో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తారు. పగటి పూట ఐదుగురు మించి గుమిగూడి ఉండకూడదు. థియేటర్లు, పార్కులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూసివేస్తారు. కేవలం టేక్‌అవే, ఫుడ్‌, నిత్యవసరాల డెలివరీని మాత్రమే అనుమతిస్తారు. ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. సినిమా షూటింగ్‌లను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారు.

Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!

ఇవి కూడా చదవండి : మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!

Tamil Nadu Assembly Elections 2021: తమిళనాడు మూగబోనున్న మైకులు.. చివరి రోజు కూడా ఎన్నికల సిత్రాలు.. విచిత్రాలు..