AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CORONA SECOND-WAVE: ఇంటి చికిత్స పొందినోళ్ళే బెటర్.. ఆసుపత్రికెళ్ళొచ్చినోళ్ళపైనే సెకెండ్ వేవ్ ప్రభావం అధికం

దేశంలోకి కరోనా వైరస్ ఎంటరైన ఏడాదిన్నర కాలంగా ఎన్నో వదంతులు, మరెన్నో ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ఓసారి కరోనా వస్తే రెండో సారి మళ్ళీ కరోనా సోకదన్నది అందులో ఒకటి. కానీ అది నిజం కాదని..

CORONA SECOND-WAVE: ఇంటి చికిత్స పొందినోళ్ళే బెటర్.. ఆసుపత్రికెళ్ళొచ్చినోళ్ళపైనే సెకెండ్ వేవ్ ప్రభావం అధికం
Home Treatment Patentions
Rajesh Sharma
|

Updated on: May 18, 2021 | 6:31 PM

Share

CORONA SECOND-WAVE EFFECTS HOSPITALIZED PEOPLE: దేశంలోకి కరోనా వైరస్ (CORONA VIRUS) ఎంటరైన ఏడాదిన్నర కాలంగా ఎన్నో వదంతులు, మరెన్నో ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. ఓసారి కరోనా వస్తే రెండో సారి మళ్ళీ కరోనా సోకదన్నది అందులో ఒకటి. కానీ అది నిజం కాదని.. మ్యూటెంట్ (MUTANT) అయిన కరోనా వైరస్ చాలా మందికి రెండోసారి కూడా సోకింది. మరో అడుగు ముందుకేసి.. వ్యాక్సిన్ (VACCINE) తీసుకున్నవారికి కూడా కరోనా వైరస్ రెండోసారి సోకిన పరిస్థితి. ఈక్రమంలోనే ఓ అధ్యయనం (STUDY) ద్వారా ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.

గత సంవత్సరం కరోనా వైరస్ మొదటి వేవ్ (FIRST WAVE) సమయంలో వైరస్ సోకిన వారిలో కొందరు హాస్పిటళ్ళలో చికిత్స పొంది కోలుకున్నారు. మరికొందరు ఇంటి వద్దనే వుండి చికిత్స పొంది కోలుకున్నారు. మరికొందరైతే స్వల్ప లక్షణాలతో అసలు కరోనా సోకినట్లే తెలియకుండా కోలుకున్నారు. ఇలాంటి వారిలో రెండోసారి సెకెండ్ వేవ్‌ (SECOND WAVE)లో మ్యూటెంట్ అయిన కరోనా సోకితే ఏమవుతుంది? ఈ చర్చ చాలా మందిలో జరుగుతోంది. అయితే తాజాగా వెల్లడైన ఓ అధ్యయనం నివేదిక ఇంటరెస్టింగ్ వార్త (INTERESTING NEWS)ను మోసుకొచ్చింది. మొదటి దశ కరోనా కాలంలో ఇంటి వద్దే వైద్యం పొందిన వారిలో సెకెండ్ వేవ్ కరోనా ప్రభావం అంతగా కనిపించడం లేదని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లక తప్పని వారిలోనే రెండో దశ కోవిడ్‌ (COVID-19) అనేక సమస్యలకు కారణమవుతోందన్నది ఈ అధ్యయనం నివేదిక. అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ (INTERNATIONAL MEDICAL JOURNAL).. లాన్సెట్‌ జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. గత సంవత్సరం మొదటి వేవ్ కరోనా పాండమిక్ (CORONA PANDEMIC) సమయంలో స్వల్ప లక్షణాలున్నవారిలో ఎక్కువ మంది ఆసుపత్రిలో చేరలేదు. ఇంటి వద్దే 14 రోజులు క్వారెంటైన్‌ (QUARENTINE)లో ఉండి.. డాక్టర్లు సూచించిన మందులు వాడి కోలుకున్నారు.

భారత్‌ (BHARAT) లాంటి దేశాల్లో ఇలా కోలుకున్నవారి రేటు ఎక్కువగానే ఉంది. అయితే.. కొంతమంది పరిస్థితి ఇబ్బందిగా ఉండటంతో ఆసుపత్రులకు వెళ్లారు. అప్పుడప్పుడే కరోనాకు వైద్యం అందుబాటులోకి వస్తున్న సమయంలో తెలియకుండానే ఆస్పత్రులు ఇచ్చిన మందులు వాడాల్సి వచ్చింది. ఇవి ఆ తర్వాత యాంటీబాడీస్‌ (ANTI BODIES)పై కొంత ప్రతికూల ప్రభావం చూపాయని లాన్సెట్‌ (LANCET) అధ్యయనం స్పష్టం చేసింది. అధ్యయనంలో భాగంగా మన దేశంలో తాజాగా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన 8,983 మందిని, నెగిటివ్‌ వచ్చిన 80,893 మందిని పరిశీలించారు. వారందించిన వివరాలను బట్టి.. తొలి దశ కోవిడ్‌లో ఇంటి వద్ద చికిత్స పొంది.. రెండో దశలో కోవిడ్‌ బారిన పడిన వారిలో 91 శాతం మందికి నెగిటివ్‌ వచ్చాక పెద్దగా సమస్యలు లేవు. అయితే.. వీరిలో కొంతమంది రెండో దశలో వైద్య సేవలకు ఆస్పత్రులకు వెళ్లారు.

వీరికి భవిష్యత్‌లో ఎలా ఉంటుందనేది అధ్యయనం చేయాల్సి ఉంది. ఇక మొదటి దశలో ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న ఎక్కువ మంది రెండో దశలో కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చినా ఎక్కువగా మైగ్రేన్ (MIGRAINE), శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. స్వల్ప లక్షణాలుండి.. ఇంటి వద్దే మందులతో తగ్గే అవకాశం ఉంటే.. దానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని తాజా వైద్య పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి.

ALSO READ: కరోనాపై పోరులో అసువులు బాసిన వైద్యులెందరో..? యుపీ, బీహార్‌లలోనే ఎక్కువ

ALSO READ: పెద్దన్న పాత్రలోకి మళ్ళీ అమెరికా.. 8 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీకి రెడీ

ALSO READ: నెతన్యాహుకు బైడెన్ ఫోన్.. రాకెట్ దాడులను సమర్థిస్తూనే.. కాల్పుల విరమణ పాటించాలట!