Telangana Covid : తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాన్నిస్తున్నాయి : హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావ్
Telangana Health Director on Corona : గత రెండు వారాల నుండి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావ్ చెప్పారు...
Telangana Health Director on Corona : గత రెండు వారాల నుండి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావ్ చెప్పారు. కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం కరోనా కట్టడి కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. కరోనా కట్టడిలో దేశానికి మార్గదర్శిగా తెలంగాణ ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఫిఫర్ సర్వే ఫలితాన్ని ఇచ్చిందన్న ఆయన, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 3892 కేసులు నమోదయయ్యాని వెల్లడించారు. ఈ రోజు కరోనా కారణంగా 27 మంది మృతి చెందారని, 18 రోజుల్లో 50శాతం కేసులు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు మరింత తగ్గే చాన్స్ ఉందని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలు తీసుకుంటున్న జాగ్రతలు ఫలితాన్ని ఇచ్చాయన్నారు. కరోనా పాజిటివ్ రేటు తెలంగాణ వ్యాప్తంగా రోజు రోజు కూ తగ్గుతుందని ఆయన స్పష్టం చేశారు.