AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao Review: ప్రాణవాయువు అందించేందుకు లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ యూనిట్లు.. కరోనా సమీక్షలో మంత్రి హరీష్ రావు

క‌రోనాపై పోరులో తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు మరిన్ని ఆక్సిజన్ స్టోరేజ్ ఫ్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Harish Rao Review: ప్రాణవాయువు అందించేందుకు లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ యూనిట్లు.. కరోనా సమీక్షలో మంత్రి హరీష్ రావు
Harish Rao Review On Oxygen Arrangements
Balaraju Goud
|

Updated on: May 18, 2021 | 6:14 PM

Share

Minister Harish Rao Review Meeting: క‌రోనాపై పోరులో తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు మరిన్ని ఆక్సిజన్ స్టోరేజ్ ఫ్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ మంగళవారం తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరాకై లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ యూనిట్లు, PSA ప్లాంట్ల నిర్మాణం, క్రయోజినిక్ ట్యాంకర్ల సరఫరా తదితర అంశాలపై చర్చించి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు వెంటనే తగు చర్యలను ప్రారంభించాలని వైద్య శాఖ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అవసరమైన పీఎస్ఏ ప్లాంట్లు, సామాగ్రి తదితర అంశాలకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం, ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ కొరత తీర్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఇండస్ట్రీల అవసరాలకు ఆక్సిజన్ వాడకాన్ని నిలిపివేసి ఆసుపత్రులకు అందించాలని నిర్ణయించింది.

కరోనా ఫస్ట్​ వేవ్​ గత సంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. సగటున 1000 నుండి -1200 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఈ కొరతను దేశంలోని స్థానిక ఆక్సిజన్​ ప్లాంట్ల ద్వారా తీర్చగలిగారు. అయితే, 2020 ఏప్రిల్ నాటికి, కరోనా కేసులు పెరగడం ప్రారంభించాయి, కాని ఇప్పటికీ ఆక్సిజన్ డిమాండ్ 1500MT స్థాయిని దాటలేదు. అయితే, సెప్టెంబర్ నాటికి, కరోనా కేసులు తగ్గడం ప్రారంభించాయి. దీంతో ఆక్సిజన్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. దీంతో అప్పుడు ఆక్సిజన్​ కొరత ఏర్పడలేదు. కానీ, సెకండ్​ వేవ్​లో దేశవ్యాప్తంగా చూస్తే.. రోజుకు మూడు లక్షలకు మించి కేసులు నమోదవుతున్నాయి. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా తీవ్రత పెరుగుతండటంతో హాస్పిటల్​లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది ఆక్సిజన్ డిమాండ్​ భారీగా పెరగడానికి కారణమైంది.

Read Also…  AP Corona: ఏపీలో కొనసాగుతున్న కరోనా టెర్రర్.. ఒక్క రోజులో 99 మంది మృతి.. 20 వేలకు పైగా కేసులు, ఈ జిల్లాల్లో భారీగా..!