Remdesivir: సూర్యాపేటలో అక్రమంగా రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు అమ్ముతున్న 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు

Remdesivir: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో తెలంగాణలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఇక కరోనా చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్‌ కొరత కూడా చాలా ఉంది...

Remdesivir: సూర్యాపేటలో అక్రమంగా రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు అమ్ముతున్న 11 మందిని అరెస్టు చేసిన పోలీసులు
Remdesivir
Follow us

|

Updated on: May 18, 2021 | 5:34 PM

Remdesivir: ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో తెలంగాణలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఇక కరోనా చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్‌ కొరత కూడా చాలా ఉంది. దీని కోసం చాలా మంది కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినా.. ఎక్కడ లభించడం లేదు. ఇక ఇదే అదనుగా భావించిన కొందరు అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని ముఠాలు అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక తాజాగా సూర్యాపేటలో రెమిడెసివిర్‌ ఇంజెక్ష బ్లాక్‌ మార్కె్‌ట్‌కు తరలిస్తున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 ఇంజెక్షన్లు, 11 సెల్‌ఫోన్‌లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెమిడెసివిర్‌ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి రెండు ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన నిర్వాహకులతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఇంజెక్షన్లను బ్లాక్‌ మార్కెట్లో రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ముందే ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఇలాంటి ముఠాలు పుట్టుకొచ్చి బ్లాక్‌ దందా కొనసాగిస్తున్నారు. అధిక మొత్తంలో ఇంజెక్షన్లను విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో పోలీసులు ఇలాంటి వారిని అరెస్టు చేశారు. రెమిడెసివిర్‌ అక్రమ రవాణా జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి గుట్టురట్టు చేస్తున్నారు.

ఇవీ చదవండి

Health Insurance: కరోనా సంక్షోభంలో పెరిగిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు.. 25-30 శాతం పెరిగిన బీమా ప్రీమియంలు..!

America: ప్రపంచ దేశాలకు అమెరికా భారీ సాయం.. కీలక ప్రకటన చేసిన అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్‌