Corona Positive Cases Telangana: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

Corona Positive Cases Telangana: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఒక రోజు పెరుగుతోంది. మరో రోజు తగ్గుతోంది. గురువారం రాష్ట్రంలో...

Corona Positive Cases Telangana: తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 01, 2021 | 2:59 PM

Corona Positive Cases Telangana: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఒక రోజు పెరుగుతోంది. మరో రోజు తగ్గుతోంది. గురువారం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా నేడు మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 461 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 617 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జి కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,86,815కు చేరింది. వీరిలో 2,79,456 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,815 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 1544 మంది చనిపోయారు. ఇక రాష్ట్రంలో రికవరీ రేట్ 97.43 శాతంగా ఉంది. జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 108 కొత్తగా కరోనా కేసులు నమోదు కాగా.. ఆ తరువాత రంగారెడ్డిలో 44, మేడ్చల్ మల్కాజిగిరిలో 41 కేసులు నమోదయ్యాయి.