New Coronavirus Strain: కరోనా పుట్టినిల్లులో ‘స్ట్రెయిన్’ కలకలం.. తొలి కేసు నమోదు..!
New Coronavirus Strain: ప్రపంచదేశాలను మరోసారి వణికిస్తున్న కరోనా కొత్త 'స్ట్రెయిన్' వైరస్ ఇప్పుడు చైనాను కూడా తాకింది. కరోనాకు పుట్టినిల్లు..
New Coronavirus Strain: ప్రపంచదేశాలను మరోసారి వణికిస్తున్న కరోనా కొత్త ‘స్ట్రెయిన్’ వైరస్ ఇప్పుడు చైనాను కూడా తాకింది. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో తొలి ‘స్ట్రెయిన్’ కేసు నమోదైనట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. బుధవారం చైనా సీడీసీ వీక్లీ తాజా ఎడిషన్‌లో ప్రచురించిన ఓ కధనం ప్రకారం డిసెంబర్ 14న బ్రిటన్ నుంచి షాంఘైకు వచ్చిన 23 ఏళ్ల మహిళా విద్యార్ధికి కొత్త వైరస్ సోకినట్లు అక్కడి వైద్యాధికారులు గుర్తించారు.
చైనా వచ్చిన తర్వాత ఆమె షాంఘైతో పాటు వుహన్‌లలో తిరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆమెను కాంటాక్ట్ అయినవారిని హెల్త్ అధారటీలు ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ”చైనాలో కోవిడ్ 19 నివారణ, నియంత్రణ చర్యలకు ఈ కేసు పెద్ద ముప్పు తెచ్చిపెట్టేలా ఉందని’ సీడీసీ ప్రచురణలో పేర్కొన్నారు. డిసెంబర్ 24న రోగి నమూనాలను పరిశోధించిన శాస్త్రవేత్తలు స్ట్రెయిన్ జన్యుశ్రేణికి ‘VUI202012 / 01’ అని నామకరణం చేశారు. ఈ జెనెటిక్ మ్యుటేషన్ కారణంగా కోవిడ్ 19 ప్రజలకు మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, డిసెంబర్ 24 నుంచి చైనా బ్రిటన్ విమాన రాకపోకలను రద్దు చేసింది.
China reports the first case of the new corona virus strain: Reuters
— ANI (@ANI) December 31, 2020