Corona Cases India: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఎక్కవగా ఏ రాష్ట్రంలో అంటే..?

Corona Cases Raises: దేశంలో గత నెల రోజు క్రితం తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం..

Corona Cases India: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఎక్కవగా ఏ రాష్ట్రంలో అంటే..?
corona cases
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 12, 2021 | 12:46 PM

Corona Cases In India: దేశంలో గత నెల రోజు క్రితం తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 23,285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో 23వేల పైన కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొద్ది రోజులుగా దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌లు దేశంలో వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,08,856కు చేరింది. ఇందులో 1,97,237 యాక్టివ్ కేసులు ఉండగా, 1,09,53,303 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 117 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,58,306కు చేరుకుంది. నిన్న కొత్తగా 15,157 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గురువారం ఒక్కరోజే అక్కడ 14,317 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,66,374కు పెరిగింది. ఇక నిన్న మరో 57 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 1.9లక్షల యాక్టివ్ కేసులుండగా.. అందులో లక్షకు పైగా ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,06,070కి చేరింది. దీంతో అప్రపత్తమైన మహా రాష్ట్ర సర్కార్ చర్యలకు పూనుకుంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్‌ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి:

Katas Raj Temple in Pakistan: పాకిస్తాన్‌లో పరమశివుడి ఆలయం.. దాయాది దేశంలో విరాజిల్లుతున్న భోళాశంకరుడు

Gunathilaka Out or not?: లంక, విండీస్ వన్డేలో వివాదం.. బంతిని కాళ్లతో తన్నాడని బ్యాట్స్‌మెన్ గుణతిలక ఔట్..!

India vs England: టీ 20 సిరీస్ ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకో తెలుసా..! అయితే లైవ్ ఇలా చూడండి..!