AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని గంటలకే.. బెంగాల్‌లో ఇద్దరు వృద్ధుల మృతి..

Corona vaccine: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడుత వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసి.. మార్చి 1 నుంచి రెండో..

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని గంటలకే.. బెంగాల్‌లో ఇద్దరు వృద్ధుల మృతి..
Covid-19 Vaccine
Shaik Madar Saheb
|

Updated on: Mar 12, 2021 | 3:50 PM

Share

Corona vaccine: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడుత వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసి.. మార్చి 1 నుంచి రెండో విడుత వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన మొదటి విడుత వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ ఉద్యోగులకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. మార్చి 1నుంచి 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45ఏళ్లుపైబడిన వారికి వ్యాక్సిన్‌ను వేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 2.6కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందించారు. ఈ తరుణంలో కూడా వ్యాక్సిన్లపై సందేహం నెలకొంది. వ్యా్క్సిన్ తీసుకున్న అనంతరం పలువురు మృతి చెందుతుండటం పలు ఆందోళనకు తావిస్తోంది.

తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఇద్దరు వృద్ధులు మరణించారు. ఇద్దరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం మంచిగా ఇంటికెళ్లారు. సాయంత్రం వేళ ఇద్దరికీ వాంతులయ్యాయి. వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. అయితే. టీకా తీసుకున్న వృద్ధులు గుండెపోటు కారణంగా మరణించారని వైద్యులు ప్రాథమిక పరిశీలనలో పేర్కొన్నారు. మరణించిన ఇద్దరు వృద్ధులపై వైద్యాధికారులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. డార్జిలింగ్ జిల్లాకు చెందిన పారుల్ దత్తా (75), దూఫ్ గురి ప్రాంతానికి చెందిన కృష్ణ దత్తా (65) కోవిడ్ తీసుకున్న తర్వాత మరణించారు. గతంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాస్, హౌరాలో ఇద్దరు వ్యక్తులు కరోనా టీకా తీసుకున్న తర్వాత మరణించారు.

అయితే తాజాగా ఇద్దరు మరణించడంపై అధికారులు స్పందించారు. ఇద్దరు కూడా గుండెసంబంధిత రోగాలతో బాధ‌ప‌డుతున్నార‌ని వైద్యులు తెలిపారు. అయితే వారు మృతిచెంద‌డానికి గల కారణం వ్యాక్సినా.. లేకా ఇతర అనారోగ్య కారణాలున్నాయా అనే దానిపై దర్యాప్తు జరుగుతుందని అధికారులు తెలిపారు.

Also Read:

Corona Cases India: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఎక్కవగా ఏ రాష్ట్రంలో అంటే..?

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్